పవన్ సినిమా హిట్ అయితేనే బన్నీ అతడికి ఛాన్స్ ఇస్తాడా?
ICON: వకీల్ సాబ్ కంటే ముందే వేణు శ్రీరామ్ అల్లు అర్జున్ హీరోగా ఐకాన్ అంటూ ఆ మధ్య పోస్టర్ విడుదల చేశాడు. ఉన్నట్టుండి ఈ సినిమా అప్డేట్స్ రావడం ఆగిపోయాయి.

స్టార్ హీరోతో అవకాశం అంటే అంత ఈజీగా దొరకదు. దానికి చాలా కష్టపడాలి. అయితే కొందరు దర్శకులకు మాత్రం చాలా సులువుగా స్టార్ హీరోలను డైరెక్ట్ చేసే అవకాశం వస్తుంది. అందులో వేణు శ్రీరామ్ కూడా ఉంటాడు. అప్పుడెప్పుడో పదేళ్ల కింద సిద్దార్థ హీరోగా వచ్చిన ఓ మై ఫ్రెండ్ సినిమాతో దర్శకుడిగా మారిన వేణు.. నాలుగేళ్లు కింద నానితో చేసిన ఎంసీఏ సినిమాతో విజయం అందుకున్నాడు. ఎవరూ ఊహించని విధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తున్న వకీల్ సాబ్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు వేణు శ్రీరామ్. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిపోయింది. ఏప్రిల్ 9న సినిమా విడుదల కానుంది. దాంతో ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు దర్శక నిర్మాతలు.
దిల్ రాజు, బోనికపూర్ సంయుక్తంగా పవన్ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే వకీల్ సాబ్ కంటే ముందే వేణు శ్రీరామ్ మరో సినిమాకు కమిట్ మెంట్ ఇచ్చాడు. అల్లు అర్జున్ హీరోగా ఐకాన్ అంటూ ఆ మధ్య పోస్టర్ కూడా విడుదల చేశాడు. దిల్ రాజు ఈ సినిమాను నిర్మించనున్నాడు. ఉన్నట్టుండి ఈ సినిమా గురించి అప్డేట్స్ రావడం ఆగిపోయాయి.
అలాగే వేణు శ్రీరామ్ కూడా పవన్ కళ్యాణ్ సినిమాపై పూర్తిగా దృష్టి పెట్టాడు. దాంతో అల్లు అర్జున్‌తో చేయాల్సిన ఐకాన్ అటకెక్కింది అంటూ ఇండస్ట్రీలో వార్తలు మొదలయ్యాయి.
దీనిపై అటు అల్లు అర్జున్ గానీ.. ఇటు వైపు వేణు శ్రీరామ్ గానీ ఎప్పుడూ స్పందించలేదు. కానీ ఈ సినిమా ఆగిపోలేదని త్వరలోనే సెట్స్ పైకి రానుంది అంటూ ఆ మధ్య బన్నీ క్లారిటీ ఇచ్చాడు.
కాకపోతే ఇక్కడే చిన్న కండిషన్ పెట్టాడు ఈ హీరో.

కండిషన్ ఇదేనా?
పవన్ కళ్యాణ్‌తో చేస్తున్న వకీల్ సాబ్ సినిమా సూపర్ హిట్ అయితే బన్నీ ఈ దర్శకుడికి ఒక అవకాశం ఇవ్వాలని చూస్తున్నాడు.
అలా కాకుండా పవన్ సినిమా తేడా కొడితే ఐకాన్ సంగతి కూడా మర్చిపోవాలసిందే అంటున్నారు విశ్లేషకులు.
ఈ సినిమా స్క్రిప్ట్ సిద్ధంగానే ఉన్నా.. పవన్ సినిమా భవిష్యత్తుపై ఐకాన్ ఫ్యూచర్ కూడా ఆధారపడి ఉంది. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించాలని దిల్ రాజు భావిస్తున్నాడు.
మరి వకీల్ సాబ్ తీసుకొచ్చే రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి. దాన్ని బట్టే ఐకాన్ సినిమా ఉంటుందా లేదా అనేది క్లారిటీ వస్తుంది.
ఇవి కూడా చదవండి..
నవీన్ పొలిశెట్టికి వార్నింగ్ ఇచ్చిన రాహుల్ రామకృష్ణ
అక్కడ స్టార్ హీరోలు.. మన భాషలో సూపర్ విలన్స్
జలపాతంలా హంసానందిని నయగారాలు
పింక్ రీమేక్‌కు ‘వకీల్‌సాబ్’ టైటిల్ అనుకోలేదట..!
ఫేక్ అకౌంట్స్ నమ్మోద్దంటూ వైష్ణవ్ తేజ్ ప్రకటన
ఎవరు మీలో కోటీశ్వరులు న్యూ ప్రోమో
సీటీమార్ నుండి పెప్సీ ఆంటీ మాస్ మసాలా సాంగ్ విడుదల
నేను దేశ భక్తురాలిని.. అవినీతిపరురాలిని కాదు: కంగనా రనౌత్
తమన్నా ఇంటిని చూస్తారా.. ఇంధ్రభవనం కూడా తక్కువే..
ఈ వారం బ్యాడ్ ఫ్రైడే.. అన్ని సినిమాలు డీప్ ఫ్రై..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

