e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home News నవీన్ పొలిశెట్టికి వార్నింగ్ ఇచ్చిన రాహుల్ రామకృష్ణ

నవీన్ పొలిశెట్టికి వార్నింగ్ ఇచ్చిన రాహుల్ రామకృష్ణ

ఏంటి.. నిన్నమొన్నటి వరకు బాగానే ఉన్నారు.. పైగా జాతి రత్నాలు ప్రమోషన్ కోసం బాగానే తిరిగారు ఇంతలోనే ఏమైంది అనుకుంటున్నారా..? నిజంగానే ఇప్పుడు జాతి రత్నాల మధ్య గొడవైంది. త‌న‌కు హ్యండ్ ఇచ్చి న‌వీన్‌, ప్రియ‌ద‌ర్శి అమెరికా వెళ్లిపోయార‌ని రాహుల్ కోపానికొచ్చాడు. రాహుల్ రామ‌కృష్ణ ఫ‌న్నీగా ఇచ్చిన వార్నింగ్ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

నవీన్ పొలిశెట్టికి వార్నింగ్ ఇచ్చిన రాహుల్ రామకృష్ణ

జాతిర‌త్నాలు సినిమాలో నవీన్ పొలిశెట్టి, రాహుల్, ప్రియదర్శి కలిసి చేసిన కామెడీకి బాక్సాఫీస్ మోతెక్కిపోతుంది. ఇప్పటికే రూ.30 కోట్లకు పైగా వసూలు చేసింది ఔరా అనిపించారు ఈ ముగ్గురు.

ఇదిలా ఉంటే ఈ సినిమా రేంజ్ కేవలం ప్రమోషన్స్‌ కారణంగానే మరింత పెరిగిపోయింది అనడంలో అతిశయోక్తి లేదేమో..? ఎందుకంటే అంతగా ప్రమోట్ చేశారు దీన్ని.

నవీన్ పొలిశెట్టి అయితే తన మార్క్ ప్రమోషన్స్ తో సినిమా రేంజ్‌నే మార్చేశాడు. తాజాగా నవీన్, ప్రియదర్శి అమెరికాలో ఉన్నారు. అక్కడ మూడు రోజుల పాటు అన్ని చోట్లకు తిరుగుతున్నారు.

కరోనా తర్వాత మిలియన్ మార్క్ వైపు అడుగులు వేస్తున్న తొలి సినిమా కావడంతో ఓవర్సీస్ ఆడియన్స్ కు థ్యాంక్స్ చెప్పడానికి అక్కడికి వెళ్లారు వీళ్లు.

నవీన్ పొలిశెట్టికి వార్నింగ్ ఇచ్చిన రాహుల్ రామకృష్ణ

అయితే నవీన్, దర్శి మాత్రమే అమెరికా వెళ్లారు. అక్కడ థియేటర్స్‌తో పాటు రాష్ట్రాలు తిరుగుతున్నారు. దాంతో ఇవన్నీ చూసిన తర్వాత మరో జాతి రత్నం రాహుల్ రామకృష్ణ ఓ వీడియో పోస్ట్ చేశాడు.

వాళ్లకు వార్నింగ్ ఇస్తూ వీడియో పోస్ట్ చేశాడు. రాహుల్ రామకృష్ణ పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతుంది.

వీడియోలో ఏముంది?

అరేయ్‌ దర్శి, నవీన్‌.. పీపుల్స్‌ ప్లాజాలో సక్సెస్‌మీట్ అయ్యాక.. మిమ్మల్ని కలిసేలోపే పాస్‌పోర్ట్‌తో ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి.. విమానమెక్కి యూఎస్‌ వెళ్లిపోతారేరా.! నేను చెప్పా కదరా.. నా దగ్గర కూడా పాన్‌ కార్డ్‌ ఉందని. పాన్‌కార్డు చూపిస్తే అక్కడ ఎంట్రీ ఇస్తార్రా..! జోగిపేట రవిరా నేను. నా వల్లే ప్రాబ్లమ్‌ అవుతుందని నన్ను వదిలేసి వెళ్లిపోయారు కదరా! మీరు రండ్రా మీ సంగతి చెబుతా..! అంటూ వార్నింగ్ ఇచ్చాడు రాహుల్ రామకృష్ణ.

సరదా కోసం చేసిన ఈ వీడియో వైరల్ అవుతుంది. జాతి రత్నాలు విడుదలైన రెండో వారం కూడా అదిరిపోయే వసూళ్లు సాధిస్తుంది.

ఈ ప్రమోషన్స్ కారణంగా సినిమా రేంజ్ ఇంకా పెరిగిపోతుంది. ఏదేమైనా కూడా రాహుల్, నవీన్ మధ్య వార్నింగ్ వీడియో కూడా వైరల్ అవుతుందిప్పుడు.

ఇవి కూడా చ‌దవండి..

అక్క‌డ స్టార్ హీరోలు.. మన భాషలో సూపర్ విలన్స్

జ‌ల‌పాతంలా హంసానందిని న‌య‌గారాలు

పింక్ రీమేక్‌కు ‘వ‌కీల్‌సాబ్’ టైటిల్ అనుకోలేద‌ట‌..!

ఫేక్ అకౌంట్స్ న‌మ్మోద్దంటూ వైష్ణ‌వ్ తేజ్ ప్ర‌క‌ట‌న‌

ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు న్యూ ప్రోమో

సీటీమార్ నుండి పెప్సీ ఆంటీ మాస్ మ‌సాలా సాంగ్ విడుద‌ల

నేను దేశ భక్తురాలిని.. అవినీతిపరురాలిని కాదు: కంగనా రనౌత్

గ్లామర్‌ పాత్రలకు ఓకే!

కీర్తి సురేష్ కనిపించట్లేదంటూ నితిన్ ట్వీట్.. పోలీసుల రిప్లై..

తమన్నా ఇంటిని చూస్తారా.. ఇంధ్రభవనం కూడా తక్కువే..

సర్కారు వారి పాట తర్వాత మహేష్ బాబు 60 రోజుల మాస్టర్ ప్లాన్

ఈ వారం బ్యాడ్ ఫ్రైడే.. అన్ని సినిమాలు డీప్ ఫ్రై..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నవీన్ పొలిశెట్టికి వార్నింగ్ ఇచ్చిన రాహుల్ రామకృష్ణ

ట్రెండింగ్‌

Advertisement