గ్లామర్ పాత్రలకు ఓకే!

నాని ‘గ్యాంగ్ లీడర్’ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది ప్రియాంకా అరుల్ మోహన్. అచ్చతెలుగు అమ్మాయిలా కనిపించే ఈ మనోహరిది కన్నడ సీమ. అమాయకపు చూపులు, అందమైన అభినయంతో తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచింది. ఇండస్ట్రీలోకి వచ్చిన మూడేండ్లలోనే తెలుగు,తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో నటించి దక్షిణాది ప్రేక్షకులందరికీ పరిచయమైంది. తాజాగా శర్వానంద్ ‘శ్రీకారం’తో మరోసారి తెలుగు లోగిళ్లలో సందడి చేస్తున్న ప్రియాంక అరుల్ మోహన్ గురించిన ముచ్చట్లు..
నేనెప్పుడూ నటిని కావాలనుకోలేదు. నేను నటిస్తున్నానంటేనే ఇంకా నమ్మకం కలుగడం లేదు. కెరీర్ విషయంలో నా తల్లిదండ్రులు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. కన్నడలో వచ్చిన ‘ఒందు కథే ..’ నా మొదటి సినిమా. తెలుగులో ‘గ్యాంగ్ లీడర్’ కోసం హీరోయిన్ ఆడిషన్స్ చేస్తున్నారని తెలిసి నా ఫొటోలు పంపాను. అనుకోకుండా సెలెక్ట్ అయ్యాను. కథ విన్నాక వెంటనే ఓకే చెప్పేయాలనిపించింది.
సినిమాల్లోకి రాకముందు థియేటర్ ఆర్ట్స్ చేశాను. బెంగుళూరులో స్టేజ్ షోల్లో పాల్గొన్నా. అందుకే నాకు కెమెరా ఫియర్ లేదు. చేసినవి కొన్ని సినిమాలే అయినా గుర్తింపునిచ్చే పాత్రలు లభించడం నా అదృష్టం. ‘గ్యాంగ్‌లీడర్’ తర్వాత తెలుగులో చాలా అవకాశాలు వచ్చినా కథలు నచ్చక ఒప్పుకోలేదు. ‘శ్రీకారం’ కథ బాగుండటంతో ఓకే చెప్పా. తమిళంలో శివకార్తికేయన్ సినిమాతోపాటు మరో సినిమా చేస్తున్నా.
నా సినిమాలు చూసి చాలామంది, నేను గ్లామర్ పాత్రలు చేయనని అనుకుంటున్నారు. నిజానికి అలాంటి పాత్రల్లో కనిపించడానికి నాకేం అభ్యంతరం లేదు. అయితే, గ్లామర్ అంటే చాలీచాలని దుస్తులు వేసుకోవడం కాదు. ఎవరికీ ఇబ్బంది లేకుండా అందంగా కనిపించడం. సినిమా అంటే కుటుంబంతో కలిసి చూడ గలగాలి. సంప్రదాయమైన గ్లామర్‌కే నా ఓటు. టాలీవుడ్లో నాగార్జున, రానా, కోలీవుడ్‌లో అనికా సురేంద్రన్, ఐశ్వర్య శర్మల నటన అంటే చాలా ఇష్టం. నేను ఆదర్శంగా తీసుకునే వ్యక్తులు వీళ్లు. స్వతంత్రంగా ఉండాలనుకొంటాను. అందుకే నచ్చని కథల్ని తిర స్కరిస్తూ, నచ్చినవే చేస్తున్నా. ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్రల్లో కనిపించాలన్నదే నా తాపత్రయం.
మాది తమిళనాడుకు చెందిన సంప్రదాయ కుటుంబం. నాన్న కన్నడిగుడు, అమ్మ తమిళ వనిత. నాకు ఈ రెండు భాషలూ వచ్చు. ‘గ్యాంగ్ లీడర్’ సమయంలో తెలుగు రాకపోవడంతో కాస్త ఇబ్బందిపడ్డా. కానీ తెలుగు, కన్నడ భాషల్లో సారూప్యం వల్ల త్వరగా నేర్చుకోగలిగా. స్పష్టంగా మాట్లాడలేకపోయినా, ఇప్పుడు బాగా అర్థం చేసుకోగలుగుతున్నా.
Read Today's Latest Movie-gossips News in Telugu and Telugu News
- Tags
- Priyanka arul mohan
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

