గోపిచంద్, తమన్నా ప్రధాన పాత్రలలో సంపత్ నంది తెరకెక్కిస్తున్న చిత్రం సీటీమార్. ఏప్రిల్ 2న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. తాజాగా చిత్రం నుండి నా పేరే పెప్సీ ఆంటీ అనే సాంగ్ విడుదల చేశారు. క్రాక్ సినిమాలో ‘భూం బద్దల్’ అన్న సాంగ్తో ఓ ఊపు ఊపిన అప్సర రాణి ఇప్పుడు నా పేరే పెప్సీ ఆంటీ అంటూ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. పాటతో పాటు డ్యాన్స్ కూడా మాస్ స్టైల్లో ఉండనుండగా, ఇది ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తుందని అంటున్నారు.
పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యాన్ర్పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్న సీటీమార్ చిత్రం కబడ్డీ ఆట నేపథ్యంలో తెరకెక్కుతోంది. గోపీచంద్ ఏపీకి కోచ్గా .. తమన్నా తెలంగాణ కోచ్గా కనిపించనున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి జ్వాలా రెడ్డి అన్న సాంగ్ రిలీజై అభిమానులను బాగా ఆకట్టుకుంది. ఈ క్రమంలో సీటీమార్ సినిమా నుంచి మాస్ సాంగ్ రిలీజ్ చేసి సినిమాపై హైప్ పెంచే ప్రయత్నం చేశారు మేకర్స్ . మణిశర్మ అందించిన సంగీతం ఆకట్టుకునేలా ఉంది.