తమన్నా ఇంటిని చూస్తారా.. ఇంధ్రభవనం కూడా తక్కువే..

పైకి కనిపించదు కానీ మిల్క్ బ్యూటీ తమన్నాకు ఆస్తులు భారీగానే ఉన్నాయి. 16 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉంది కదా ఆ మాత్రం సంపాదించి ఉంటుందిలే అంటున్నారు అభిమానులు. ఇప్పుడు ఈమె ఇంటిని కూడా ఆడియన్స్‌కు పరిచయం చేసింది. అది కూడా ప్రమోషన్లో భాగంగానే చేసింది. స్వామికార్యం స్వకార్యం పూర్తైపోయినట్లు.. ఒకేసారి రెండు చేసి చూపించింది తమన్నా.
ఓ ప్రముఖ పెయింటింగ్ కంపెనీ నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా తన ఇంటిని చూపించింది ఈ ముద్దుగుమ్మ. ముంబైలో చాలా అద్భుతంగా కట్టుకుంది తమన్నా. దీనికోసం దాదాపు రూ.15 కోట్లకు పైగానే ఖర్చు చేసింది కూడా. ఇప్పుడు ఇంటి వీడియోను చూపించి అందర్నీ ఆకట్టుకుంది తమన్నా. తను లేకపోయినా తన తండ్రి అన్నీ దగ్గరుండి చూసుకుంటాడని.. ఇల్లు నిర్మాణం కూడా అన్నీ నాన్న చూసుకున్నాడని చెప్పుకొచ్చింది తమన్నా.
అత్యంత భారీ విస్తీర్ణంలో విలాసవంతంగా ఈ ఇంటిని నిర్మించుకుంది తమన్నా. షూటింగ్స్ కారణంగా ఎక్కువగా తాను ఇంట్లో ఉండే అవకాశం లేకపోయినా కూడా నాన్నే పనులు కూడా పూర్తి చేశాడని వీడియోలో చెప్పింది. షూటింగ్స్ కోసం ఎన్ని దేశాలు తిరిగినా కూడా ఒక్కసారి తన సొంతింట్లోకి వచ్చి పడుకుంటే ఆ వచ్చే అనుభూతి మరెక్కడా దొరకదు అంటుంది తమన్నా.
ఇంట్లో ఉన్నపుడు తన తల్లిదండ్రులతో సరదాగా మాట్లాడుతూ.. టీ తాగడాన్ని ఆస్వాదిస్తానంటుంది మిల్కీ బ్యూటీ. హోమ్ టూర్లో భాగంగా ఇవన్నీ చెప్పుకొచ్చింది తమన్నా. అంతేకాదు తన ఇంట్లో ఎంతో యిష్టమైన మరో మెంబర్ ను పరిచయం చేసింది తమన్నా. అదే తన పెంపుడు కుక్క. దాదాపు 8 సంవత్సరాలుగా అక్కడే ఉన్నామని చెప్పుకొచ్చింది తమన్నా.
ఇంటీరియర్ డిజైన్లకు సంబంధించిన ప్రతి విషయాన్ని తన తండ్రి దగ్గరుండి చూసుకున్నారని.. షూటింగ్స్ పేరుతో తాను అక్కడ లేకపోవడంతో తండ్రికి చాలా ఇబ్బందులు కూడా వచ్చాయని గుర్తు చేసుకుంది తమన్నా. సినిమాలతో పాటు ఇతర పనుల రీత్యా తాను ఇంట్లో చాలా తక్కువ సమయాన్ని గడుపుతుంటానని చెప్పింది ఈ ముద్దుగుమ్మ. ఎక్కడెక్కడ తిరిగినా కూడా ఇంటికి రాగానే కొంచెం ప్రశాంతంగా ఉంటుందని.. అలాగే తన ఇల్లు ప్రతిరోజూ కొత్తగానే ఉంటుందని చెప్పుకొచ్చింది తమన్నా. సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె అనిల్ రావిపూడి ఎఫ్ 3తో పాటు సత్యదేవ్ గుర్తుందా శీతాకాలం సినిమాలతో బిజీగా ఉంది. వాటితో పాటు ఈ మధ్యే మహేష్ బాబుతో ఓ యాడ్ లో కలిసి నటించింది తమన్నా.
Read Today's Latest Movie-gossips News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
హైదరాబాద్‌ను గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్‌గా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ దే : జగన్ మోహన్ రావు
Dada | బాలయ్య ‘దాదా’లో క్రేజీ ఐటెం సాంగ్.. థమన్ ఈసారి కూడా మాస్ బీట్తో దుమ్మురేపనున్నాడా?
Ramayana | రామ్ – రావణ్ వైభవాన్ని బిగ్ స్క్రీన్‌పై చూడాల్సిందే.. ‘రామాయణ’ సినిమాపై సందీప్ రెడ్డి వంగా ప్రశంసలు
Scene | సూర్య ‘సీన్’ ఓటీటీ రిలీజ్ టైం ఫిక్స్ .. నెట్‌ఫ్లిక్స్‌లో ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ కానుందంటే!
Kamareddy | కామారెడ్డి జిల్లా జిల్లాలో విషాదం.. కుంటలో పడి తండ్రి, కూతురు మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

