చిరంజీవి సర్జా మరణం గత ఏడాది కన్నడ ఇండస్ట్రీని షాక్‌కి గురిచేసింది. స్టార్ హీరోగా వెలుగొందుతున్న సర్జా.. చిన్న వయసులోనే మరణించడంతో కన్నడ పరిశ్రమ ఒక్కసారిగా విషాదంలోకి వెళ్లింది. ఎంతో భవిష్యత్ ఉన్న నటుడు.. 35 ఏళ్ల వయసుకే కన్నుమూయడంతో శాండిల్‌వుడ్ కన్నీటి పర్యంతమైంది. చిరంజీవి సర్జా మరణ వార్తను జీర్ణించుకోవడానికి అభిమానులకు చాలా సమయం పట్టింది. కుటుంబసభ్యులు అయితే ఈ చేదు వార్త నుంచి బయటకు రాలేకపోతున్నారు. ఇక సర్జా భార్య పరిస్థితి అయితే మరీ దారుణం. ఆయన మరణించే సమయానికి ఆమె ఐదు నెలల గర్భవతి. చిరు మరణంతో కుంగిపోయిన ఆమె ఇంటికే పరిమితమైంది. చాలా రోజులు ఇంటి నుంచి బయటకు వెళ్లని ఆమె ఇటీవల ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
చిరంజీవి సర్జా మరణించిన తర్వాత ఆయన భార్య మేఘనా రాజ్ పూర్తిగా బయటకు రావడం మానేసింది. ఇలాగే ఇంటి పట్టునే ఉంటే ఆరోగ్యం పాడవుతుందని.. మానసికంగా ఇంకా కుంగుబాటుకు గురవుతాననే ఉద్దేశ్యంతో మేఘనా రాజ్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. తన జీవితంలో జరిగిన సంఘటన మరిచిపోవాలంటే బిజీగా మారిపోవాలని అనుకుంది. ఇందుకోసం సినిమాల్లో నటించడం ఒక్కటే మార్గమని నిర్ణయించుకుంది మేఘనా రాజ్. ఈ క్రమంలో వరుసగా సినిమాలను ఒప్పుకుంటుంది మేఘనా రాజ్.
చిరంజీవి సర్జాతో పెళ్లికి ముందు చాలా కన్నడ సినిమాల్లో మేఘనా రాజ్ నటించింది. తెలుగులో అల్లరి నరేశ్ హీరోగా వచ్చిన బెండు అప్పారావ్ సినిమాలో ఓ హీరోయిన్‌గానూ మేఘనా రాజ్ నటించింది. చిరంజీవితో పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.
ఇప్పుడు మళ్లీ కెరీర్లో బిజీ అవ్వాలని చూస్తుంది మేఘనా రాజ్. ప్రస్తుతం ఆమె చేతిలో సెల్ఫీ మమ్మీ గూగుల్ డాడీ, బుద్ధిమంత 2 సినిమాలున్నాయి. ఈ రెండు సినిమాలతో పాటు మరికొన్ని ప్రాజెక్ట్స్ కూడా లైన్లో పెట్టింది మేఘనా రాజ్.
చిరంజీవి లేని లోటు కనిపించకూడదు అంటే వరస సినిమాలు చేయడం ఒక్కటే మార్గమని ఇటు వైపు అడుగులు వేస్తోంది మేఘనా రాజ్. ఈ నిర్ణయంతో కుటుంబ సభ్యులు కూడా సంతృప్తికరంగా ఉన్నారు. చిరంజీవి సర్జా మరణించిన నాలుగు నెలల తర్వాత మేఘనా రాజ్‌కు ఒక అబ్బాయి పుట్టాడు. అతనికి జూనియర్ చిరంజీవి అని నామకరణం చేశారు.
ఐశ్వర్యరాజేశ్ ఫైనల్..మరో హీరోయిన్ కోసం వేట..!
ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాపై క్లారిటీ..!
జాతీయ అవార్డుల్లో సైరాకు అన్యాయం జరిగిందా?
ముద్దు వీడియో షేర్ చేసిన జెనీలియా.. స్పందించిన ప్రీతి
ఈ ఇద్దరు కొత్త హీరోయిన్ల సుడి పీక్స్.. స్టార్ హీరోలతో ఆఫర్స్
తరుణ్ రీఎంట్రీ.. లవ్ స్టోరీతో వస్తున్నాడంట
జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా ‘జెర్సీ’
ఉత్తమ నటి కంగనా.. ఉత్తమ హిందీ చిత్రం చిచోరే
కంగనా రనౌత్ @ నేషనల్ అవార్డ్ నెం 4.. ఈ తరం మహానటి…
‘మహర్షి’ సినిమాకి 3 జాతీయ అవార్డులు.. కాలర్ ఎగరేస్తున్న మహేష్ ఫ్యాన్స్
జాతీయ అవార్డులు గెలుచుకుంది వీళ్లే
ఆ సోకులు చూసి చిన్నదాన నీకోసం అంటారేమో మిస్తీ
మరో విషాదం.. ప్రముఖ కమెడియన్ కన్నుమూత
పవన్ సినిమా హిట్ అయితేనే బన్నీ అతడికి ఛాన్స్ ఇస్తాడా?
నేను సున్నితమైన వ్యక్తిని: అదితీరావు హైదరి