కాచారంలో తక్షణమే మైనింగ్ తవ్వకాలు ఆపాలి : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
తప్పుడు ప్రజాభిప్రాయ సేకరణతో అక్రమ అనుమతులు పొందిన మైనింగ్ కంపెనీలు ప్రజల జీవితాలతో చెలగామాడుతూ ప్రకృతి విద్వాంసానికి పాల్పడుతున్నాయని సిపిఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. నల్లగొండ జిల్లా దేవరకొండ మండలంలోని కాచారం గ్రామంలో నెలకొల్పిన మైనింగ్ వల్ల...
– తప్పుడు ప్రజాభిప్రాయ సేకరణతో అక్రమ అనుమతులు
దేవరకొండ రూరల్, అక్టోబర్ 22 : తప్పుడు ప్రజాభిప్రాయ సేకరణతో అక్రమ అనుమతులు పొందిన మైనింగ్ కంపెనీలు ప్రజల జీవితాలతో చెలగామాడుతూ ప్రకృతి విద్వాంసానికి పాల్పడుతున్నాయని సిపిఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. నల్లగొండ జిల్లా దేవరకొండ మండలంలోని కాచారం గ్రామంలో నెలకొల్పిన మైనింగ్ వల్ల ఆ గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందు పడుతూ, అనారోగ్య సమస్యలతో బాధపడుతూ, పంటలను కోల్పోతూ శ్వాస కోశ వ్యాధులతో ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. కావునా తక్షణమే మైనింగ్ పనులు ఆపివేయాలని డిమాండ్ చేశారు. కాచారం గ్రామ ప్రజలు చేస్తున్న 11వ రోజు దీక్షకు నల్లగొండ జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ (సిపిఐ )పక్షాన సిపిఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నర్సింహా రెడ్డి, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తూం బుచ్చిరెడ్డి బృందం సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా ప్రజలతో మాట్లాడిన వారు మైనింగ్ వల్ల కలుగుతున్న ఇబ్బందులు తెలుసుకున్నారు. కాచారం గ్రామాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తామని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని భ్రమలు కల్పించినట్లు తెలిపారు. గ్రీన్ ట్రైబ్యునల్ ప్రజాభిప్రాయ సేకరణలో గ్రామస్తులు వ్యతిరేకించినా కంపెనీ వారే కొంతమందిని ఏర్పాటు చేసుకుని తప్పుడు ప్రజాభిప్రాయంతో మైనింగ్ కొనసాగిస్తున్నారని, తక్షణమే అక్రమ మైనింగ్‌ను నిలిపివేయాలని వారు హెచ్చరించారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కాచారంలో తక్షణమే మైనింగ్ తవ్వకాలు ఆపాలి : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
PM Modi | ఢిల్లీలో మోదీతో పోలండ్ ప్రధాని భేటీ.. ఇండియా-పోలండ్ మధ్య కీలక ఒప్పందాలు
FMG Doctors | ఎఫ్ఎంజీ వైద్యుల నిరసన.. అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో
Man Dragged On Car Roof | వ్యక్తి చేతులను కారు విండోలో ఇరికించి రూఫ్‌పై తీసుకెళ్లి.. వాహనంతో తొక్కి హత్య
Akka Trailer | స్త్రీల రాజ్యమేలుతున్న పెన్నురు గడ్డపై పవర్ వార్.. కీర్తి సురేష్ ‘అక్క’ ట్రైలర్ అదుర్స్!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

