‘ప్రజా వీరుడు పండుగ సాయన్న’
పేదలు, అణగారిన వర్గాల పక్షాన నిలిచి, భూస్వాములు, దొరల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి పండుగ సాయన్న అని. జానపద కథనాల్లో పండుగ సాయన్నను 'తెలంగాణ రాబిన్ హుడ్' అని పిలుస్తారని నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం నల్లగొండ కార్పోరేషన్ కార్యాలయంలో పండుగ సాయన్న జయంతి కార్యక్రమాలను...
– నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి
నీలగిరి, అక్టోబర్ 22 : పేదలు, అణగారిన వర్గాల పక్షాన నిలిచి, భూస్వాములు, దొరల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి పండుగ సాయన్న అని. జానపద కథనాల్లో పండుగ సాయన్నను ‘తెలంగాణ రాబిన్ హుడ్’ అని పిలుస్తారని నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం నల్లగొండ కార్పోరేషన్ కార్యాలయంలో పండుగ సాయన్న జయంతి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా సాయన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భూస్వాములు, దొరల ఆధిపత్యం, పేదలపై దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన ప్రజా వీరుడు సాయన్న అని కొనియాడారు. ఆయన పోరాట స్ఫూర్తి, సేవాభావం నేటి తరానికి ఆదర్శమని, మహనీయుల చరిత్రను భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. సమాజంలో సమానత్వం, న్యాయం, ప్రజా సంక్షేమం వంటి విలువలను పెంపొందించడంతో మహనీయుల జీవిత చరిత్రలు కీలకపాత్ర పోషిస్తాయని, వారి ఆశయాలను స్మరించుకుంటూ సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చరియాలన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వంశీకృష్ణ, కార్పోరేటర్లు అబ్బగోని కవితా రమేష్, యామ కవితా రాణీ దయాకర్, అలకుంట నాగరాజు, గుండిబోయిన కుష్పలతవెంకన్న, మాజీ కౌన్సిలర్ ఎడ్ల శ్రీనివాస్, డీఈ ఆశోక్, సిబ్బంది పాల్గొన్నారు.
12వ బెటాలియన్‌లో…
పండుగ సాయన్న ముదిరాజ్ జయంతిని గురువారం 12వ తెలంగాణ స్పెషల్ పోలీస్ బెటాలియన్, అన్నేపర్తిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బెటాలియన్ కమాండెంట్ బి.రామకృష్ణ పండుగ సాయన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆయన ధైర్యసాహసాలను, పోరాట స్ఫూర్తిని, ప్రజల కోసం చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమాండెంట్ ఎల్.నాగేశర్రావు, అసిస్టెంట్ కమాండెంట్లు నర్సింగ్ వెంకన్న, కె.మహేందర్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ దయాకర్, యూనిటీ మెడికల్ ఆఫీసర్ ఆర్.షర్మిలా దేవి, వితిన్ గౌతమ్, ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

‘ప్రజా వీరుడు పండుగ సాయన్న’
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ప్రజా వీరుడు పండుగ సాయన్న’
కాచారంలో తక్షణమే మైనింగ్ తవ్వకాలు ఆపాలి : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
PM Modi | ఢిల్లీలో మోదీతో పోలండ్ ప్రధాని భేటీ.. ఇండియా-పోలండ్ మధ్య కీలక ఒప్పందాలు
FMG Doctors | ఎఫ్ఎంజీ వైద్యుల నిరసన.. అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో
Man Dragged On Car Roof | వ్యక్తి చేతులను కారు విండోలో ఇరికించి రూఫ్‌పై తీసుకెళ్లి.. వాహనంతో తొక్కి హత్య
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

