MCD: కాలుష్యంపై చర్చ.. ఢిల్లీ మున్సిపల్ సమావేశాల్లో గందరగోళం
MCD: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో కాలుష్యంపై చర్చ వేళ బీజేపీ, ఆప్ కౌన్సిర్లు ఒకర్ని ఒకరు తిట్టుకున్నారు. ముష్టిఘాతానికి దిగారు. మేయర్ వద్ద ఉన్న మైక్రోఫోన్‌ను ఆప్ కౌన్సిలర్ బ్రేక్ చేశాడు.
న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(MCD) సమావేశాల్లో గందరగోళం నెలకొన్నది. కాలుష్యంపై చర్చ వేళ సభ్యులు వాగ్వాదానికి దిగారు. సభలో మైక్రోఫోన్లను కౌన్సిలర్లు ధ్వంసం చేశారు. చర్చ సమయంలో ఫైళ్లను విసిరేసుకున్నారు. కాలుష్య నియంత్రఫై గురువారం ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మీటింగ్‌లో చర్చ జరిగింది. అధికార బీజేపీ, ప్రధాన ప్రతిపక్షం ఆప్ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. ఓ దశలో ఇద్దరూ వాటర్ బాటిళ్లు, ఫైళ్లు విసురుకున్నారు. కాంగ్రెస్ సభ్యులు కూడా ఈ గొడవలో జత కూడారు. మేయర్ పర్వేశ్ వాహిని మార్షల్స్ సురక్షితంగా బయటకు తీసుకెళ్లారు.
తమ వార్డులకు అభివృద్ధి నిధులను తక్షణమే రిలీజ్ చేయాలని ఆప్ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. 25 లక్షల డెవలప్మెంట్ ఫండ్‌ను రిలీజ్ చేసినట్లు మేయర్ వాహి ప్రకటించారు. ఈ వార్షిక ఏడాది కోసం రెండు కోట్లు కౌన్సిలర్లకు ఇవ్వనున్నట్లు తెలిపారు. అయితే తక్షణ సహాయంగా కోటి రిలీజ్ చేయాలని ఆప్ నేతలు డిమాండ్ చేశారు. మేయర్ చైర్ వద్దకు వెళ్లి ఆప్ కౌన్సిలర్లు నినాదాలు చేశారు. దీంతో 5 నిమిషాల పాటు సభ వాయిదా పడింది. తర్వాత కౌన్సిలర్లు మళ్లీ సమావేశం అయ్యారు. ఆ తర్వాత కాలుష్య నియంత్రణపై చర్చ చేపట్టారు.
కాలుష్యంపై చర్చ వేళ బీజేపీ, ఆప్ కౌన్సిర్లు ఒకర్ని ఒకరు తిట్టుకున్నారు. ముష్టిఘాతానికి దిగారు. మేయర్ వద్ద ఉన్న మైక్రోఫోన్‌ను ఆప్ కౌన్సిలర్ బ్రేక్ చేశాడు. విపక్ష నేత అంకుశ్ నారంగ్ కూడా మైక్రోఫోన్‌ను ధ్వంసం చేశాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MCD: కాలుష్యంపై చర్చ.. ఢిల్లీ మున్సిపల్ సమావేశాల్లో గందరగోళం
‘ప్రజా వీరుడు పండుగ సాయన్న’
కాచారంలో తక్షణమే మైనింగ్ తవ్వకాలు ఆపాలి : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
PM Modi | ఢిల్లీలో మోదీతో పోలండ్ ప్రధాని భేటీ.. ఇండియా-పోలండ్ మధ్య కీలక ఒప్పందాలు
FMG Doctors | ఎఫ్ఎంజీ వైద్యుల నిరసన.. అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

