సింగరేణి సమస్యలపై కేటీఆర్‌తో ఎంపీ రవిచంద్ర చర్చ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఎంపీ వద్దిరాజు రవిచంద్ర గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
రుద్రంపూర్, అక్టోబర్ 22 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఎంపీ వద్దిరాజు రవిచంద్ర గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించి దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎంపీ రవిచంద్రతో పాటు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) అధ్యక్షుడు రాజిరెడ్డి, ముఖ్య ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ, నాయకులు వీరభద్రం, ఊకంటి ప్రభాకర్ రావు, జి.కె. సంపత్ కుమార్, నాగెళ్లి వెంకటేశ్వర్లు, గడప రాజయ్య, జాఫర్ తదితరులు సింగరేణిలో నెలకొన్న సమస్యలను కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి చర్చించారు. కార్మికులకు సంబంధించిన సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడారు. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి సంబంధించి ఈ సమావేశంలో చర్చ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

