జాతీయ ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై ప్రశంసలు కురిపించింది సమంత అక్కినేని. తలైవి ట్రైలర్ అద్భుతమంటూ కొనియాడింది. ఈ జనరేషన్లో అత్యంత ధైర్యవంతురాలివి. మోస్ట్ టాలెంటెడ్ నటివి అంటూ కంగనను ఆకాశానికెత్తింది. జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన తలైవి మూవీ ట్రైలర్ ఈ మధ్యే రిలీజైన విషయం తెలిసిందే. జయలలిత పాత్రలో జీవించేసిన కంగనపై సినీ ఇండస్ట్రీ మొత్తం ప్రశంసల జల్లు కురిపిస్తోంది. తాజాగా కంగన ఫ్యాన్స్ లిస్ట్‌లో సమంత కూడా చేరింది. ట్రైలర్ గూస్బంప్స్ తెప్పించేలా ఉన్నదని డైరెక్టర్ విజయ్‌నీ పొగిడిన సమంత.. థియేటర్లో ఈ మ్యాజిక్‌ను చూడటానికి ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు ట్వీట్ చేసింది. 2019లోనూ కంగన నటించిన మణికర్ణిక మూవీ చూసిన తర్వాత కూడా ఆమె పర్ఫార్మెన్స్ను తెగ మెచ్చుకుంది సమంత. తలైవి మూవీ ఏప్రిల్ 23న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.