(Accident at Sabarimala) కర్నూలు : శబరిమలలో గురువారం ఉదయం జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో కర్నూలు జిల్లాకు చెందిన ఇద్దరు అయ్యప్పస్వాములు దుర్మరణం పాలయ్యారు. వీరు శబరిమల దేవస్థానానికి సమీపంలో రోడ్డుపై టీ టాగేందుకు వాహనం నిలుపగా ఈ ప్రమాదం సంభవించింది. కేరళ పోలీసులు కర్నూలు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ప్రమాదం విషయం వెలుగులోకి వచ్చింది.
కర్నూలు బుధవారపేటకు చెందిన అయ్యప్పస్వాములు 11 మంది బుధవారం వ్యానులో శబరిమలకు బయల్దేరారు. గురువారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో టీ తాగేందుకు రోడ్డు వారగా వ్యాన్ నిలిపి కిందికి దిగారు. ఇంతలో మరో వాహనం వేగంగా దూసుకొచ్చి వీరి వ్యాన్‌ను ఢీకొట్టింది. అనంతరం స్వాములపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు స్వాములు మృతిచెందగా.. తొమ్మిది మంది గాయపడ్డారు. మృతులను బుధవారపేట దేవ్‌నగర్‌కు చెందిన ఆదినారాయణ, శంకర్‌గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నది. శబరిమలకు 60 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. స్థానికులు పోలీసులకు సమాచారం అందించి క్షతగాత్రులను సమీపంలోని దవాఖానకు తరలించారు. కేరళ పోలీసులు కర్నూలు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ప్రమాదం విషయం వెలుగులోకి వచ్చింది.
వైరస్‌తో ఊబకాయులకు యమ డేంజర్ అంటున్న నిపుణులు
వాట్సాప్‌లో హలో మమ్మీ! హలో డాడీ.. అంటూ వచ్చే మెసేజ్‌లతో జాగ్రత్త!.. ఎందుకంటే..
వేరియంట్‌కు స్పానిష్ ఫ్లూకి ఉన్న పోలిక ఏంటి?
అక్కడి నీళ్లలో తేలియాడొచ్చు.. ఈత రాకున్నా అస్సలు మునగరు : వైరల్ వీడియో
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..