(SI suicide) కర్నూలు : జిల్లాకు చెందిన ఎస్ఐ ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. విషం తీసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కర్నూలు నగరం పరిధిలోని వెంకటరమణ కాలనీలోని ఆయన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మానసిక కుంగుబాటు కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.
కర్నూలు జిల్లా పోలీసు శాఖలోని ఈ-కాప్ విభాగంలో రాఘవరెడ్డి ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్నాడు. వెంకటరమణ కాలనీలోని అక్షయ్ నివాస్ అపార్ట్మెంట్లో నివసిస్తున్నాడు. మంగళవారం సాయంత్రం పురుగు మందు తీసుకుని తన ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషం తాగిన తర్వాత బాధ తట్టుకోలేక ఇంట్లో నుంచి బయటకు వచ్చి లిఫ్ట్ వద్ద పడిపోయాడు. గమనించిన స్థానికులు సమీపంలోని దవాఖనాకు తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి ఎస్ఐ రాఘవరెడ్డి చనిపోయినట్లు నిర్ధారించారు. అనంతపురం జిల్లా నల్లమాడ మండలం నల్ల సింగాయగారి పల్లెకు చెందిన రాఘవరెడ్డి 1991 బ్యాచ్ ఎస్ఐ. కొన్ని కారణాలతో ప్రమోషన్ అందుకోలేదు. ప్రస్తుతం ఈ-కాప్ విభాగంలో సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ ఇంఛార్జీగా వ్యవహరిస్తున్నారు. ప్రమోషన్ రాకపోవడంతో మానసిక కుంగుబాటుకు గురైనట్లు పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు.
కరోనా సోకితే ఊపిరితిత్తులకు ప్రమాదమా? ఎలా కాపాడుకోవాలి..?
మధుమేహాన్ని ఇలా అదుపులో పెట్టుకోండి..!
ఒమిక్రాన్ పిల్లలపై ప్రభావం చూపిస్తుందా? ఈ వేరియంట్ లక్షణాలేంటి?
ప్రెషర్ కుక్కర్లో వండే అన్నం ఆరోగ్యానికి మంచిదేనా..?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..