Jaish-e-Mohammed | ఎన్కౌంటర్లో హతమైన ఉగ్రవాది పాకిస్తాన్ పౌరుడే.. పాక్ ఉగ్ర చర్యలకు మరో సాక్ష్యం
Jaish-e-Mohammed : ఇటీవల జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్‌లో జరిగిన ఎన్కౌంటర్లో జైషే మొహమ్మద్ అనే పాకిస్తాన్ ఉగ్ర సంస్థకు చెందిన తీవ్రవాది హతమైన సంగతి తెలిసిందే.
Jaish-e-Mohammed : ఇటీవల జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్‌లో జరిగిన ఎన్కౌంటర్లో జైషే మొహమ్మద్ అనే పాకిస్తాన్ ఉగ్ర సంస్థకు చెందిన తీవ్రవాది హతమైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మరణించిన అదిల్ ముస్తఫా అనే ఉగ్రవాది పాకిస్తాన్ పౌరుడే అని తేలింది. దీంతో పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాదానికి పాల్పడుతోందనే విషయం మరోసారి వెల్లడైంది. ముఖ్యంగా ఎల్ఓసీ (లైన్ ఆఫ్ కంట్రోల్) వెంట పాకిస్తాన్ ప్రేరేపిస్తున్న ఉగ్రవాదానికి మరో ఆధారం దొరికింది.
తాము ఎలాంటి సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం లేదన్న పాక్ వాదన అబద్ధం అని తేలింది. జమ్మూ కాశ్మీర్, ఉధంపూర్ పరిధిలోని బ్రట్టాల్ అటవీ ప్రాంతంలో సెప్టెంబర్ 17న రాత్రి ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో పాకిస్తాన్ కేంద్రంగా పని చేస్తున్న జైషే మొహమ్మద్ అనే తీవ్రవాద సంస్థకు చెందిన ఇద్దరు తీవ్రవాదులు హతమయ్యారు. వారిలో ఒకడు అదిల్ అలియాస్ ముస్తఫా, ఇంకొకడు సద్దాం. ఈ ఉగ్రవాదులు పాకిస్తాన్‌కు చెందిన వారే అని ఇండియా ఆరోపిస్తే పాక్ దీన్ని ఖండించింది. వారికి, తమకు ఏ సంబంధం లేదని తెలిపింది. అయితే, వారిలో అదిల్ అలిసాయ్ ముస్తఫా.. పాకిస్తాన్ వాడే అని తేలింది.
అతడు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని, రావల్కోట్ తహసీల్ పరిధిలోని, పోతి మక్వాలన్ గ్రామానికి చెందిన వాడని తేలింది. ఇదెలా అంటే.. అతడి స్నేహితులు, సన్నిహితులు, క్లాస్మేట్స్ అందరూ అదిల్ మరణించినందుకు సంతాపం తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. అతడికి సంబంధించిన అనేక ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతేకాదు.. అతడికి పీవోకేకు చెందిన అవామీ యాక్షన్ కమిటీ నాయకుడైన సర్దార్ ఉమర్ నాజిర్తో సంబంధం ఉన్నట్లు తేలింది. దీంతో ఈ ఉగ్రవాది పాకిస్తాన్ వాడే అని రుజువైంది. సరిహద్దు గుండా పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని ఇండియాకు పంపిస్తున్నట్లు కూడా రుజువైంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Adil Mustafa
- Encounter
- JeM
- Udhampur
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

