BJP MLA’s Son | జమ్ముకశ్మీర్‌లో అదృశ్యమైన బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు.. ఢిల్లీలో ఆచూకీ లభ్యం
BJP MLA's Son | ఒక బీజేపీ ఎమ్మెల్యే కుమారుడైన బాలుడు జమ్ముకశ్మీర్‌లో అదృశ్యమయ్యాడు. దీంతో ఆ ఎమ్మెల్యే కుటుంబం ఆందోళన చెందింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగంలోకి దిగారు. సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించగా ఆ బాలుడి ఆచూకీ ఢిల్లీలో లభించింది.
శ్రీనగర్: ఒక బీజేపీ ఎమ్మెల్యే కుమారుడైన బాలుడు జమ్ముకశ్మీర్‌లో అదృశ్యమయ్యాడు. దీంతో ఆ ఎమ్మెల్యే కుటుంబం ఆందోళన చెందింది. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగంలోకి దిగారు. సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించగా ఆ బాలుడి ఆచూకీ ఢిల్లీలో లభించింది. (BJP MLA’s Son) జమ్ము బీజేపీ ఎమ్మెల్యే విజయ్ శర్మ కుమారుడైన ఆదిత్య, హిరానగర్‌లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నాడు. మంగళవారం బ్యాడ్మింటన్ ఆడేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆ బాలుడు తిరిగి రాలేదు. కిడ్నాప్ అయ్యాడని ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాగా, బీజేపీ ఎమ్మెల్యే కుమారుడి మిస్సింగ్‌పై పోలీసులు సీరియస్‌గా స్పందించారు. ఆదిత్య కోసం అన్ని ప్రాంతాల్లో వెతికారు. హిరానగర్ నుంచి కతువా, జమ్మూ వరకు అన్ని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో ఆ బాలుడు కతువా బస్ స్టాండ్‌లో బస్సు ఎక్కుతూ చివరిసారి కనిపించాడు.
మరోవైపు ఆ బస్సు తిరిగి కతువా చేరుకున్న తర్వాత డ్రైవర్, కండక్టర్‌ను పోలీసులు ప్రశ్నించారు. బాలుడు ఆదిత్య ఢిల్లీలోని తన సోదరి ఇంటికి క్షేమంగా చేరుకున్నట్లు తెలుసుకున్నారు. బీజేపీ ఎమ్మెల్యే విజయ్ శర్మకు పోలీసులు ఈ సమాచారం అందివ్వడంతో ఆ కుటుంబం ఊరట చెందింది. ఢిల్లీలోని తన కుమార్తెతో మాట్లాడిన ఆ ఎమ్మెల్యే ఈ సమాచారాన్ని నిర్ధారణ చేసుకున్నారు. తన కుమారుడిని కలిసేందుకు బుధవారం ఆయన ఢిల్లీ బయలుదేరారు.
అయితే ఇంట్లో తనకు అసౌకర్యంగా అనిపించడంతో ఆ బాలుడు తన సోదరి వద్ద ఉండేందుకు ఢిల్లీ వెళ్లినట్లు తెలిసిందని పోలీస్ అధికారి తెలిపారు. అతడ్ని ఎవరూ కిడ్నాప్ చేయలేదని వెల్లడించారు. బాలుడి అదృశ్యంపై ఫిర్యాదు అందుకున్న కొన్ని గంటల్లోనే అతడి ఆచూకీని గుర్తించినట్లు వివరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | భారత్-వెస్టిండీస్ ఐదో టీ20 వర్షార్పణమేనా..?
AI | ఏఐపై అతిగా ఆధార పడుతున్న యువత.. మానసిక ఆరోగ్యం దెబ్బ తింటుందని నిపుణుల హెచ్చరిక..
Help Desk | పట్టభద్రుల ఎన్రోల్మెంట్ హెల్ప్‌డెస్క్ ప్రారంభం
‘ఉపాధి కోసం వ్యక్తిగత రుణాలను సద్వినియోగం చేసుకోవాలి’
Bronze Medal | రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో శ్రీవల్లికి కాంస్య పతకం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

