(GST compensation) న్యూఢిల్లీ : జీఎస్టీ పరిహారం కింద నవంబర్ 3 న రాష్ట్రాలకు రూ.17 వేల కోట్లు విడుదల చేశామని, అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాటా కింద రూ.543 కోట్లు ఇచ్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. మంగళవారం రాజ్యసభలో వైసీపీ సభ్యుడు వీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. ఏప్రిల్ 20 నుంచి మార్చి 21 మధ్య జీఎస్టీ పరిహారం కింద రాష్ట్రాలకు విడుదల చేసిన రూ.1,13,464 కోట్లకు ఇది అదనం ఆయన చెప్పారు.
2017లో జీఎస్టీ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి 2017-18, 2018-19, 2019-20 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ఆయా రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం కింద రావాల్సిన మొత్తాలను పూర్తిగా విడుదల చేశామని మంత్రి పంకజ్ చౌదరి చెప్పారు. కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో జీఎస్టీ వసూళ్లు గణనీయంగా తగ్గాయని మంత్రి తెలిపారు. ఇదే సమయంలో రాష్ట్రాలకు చెల్లించాల్సిన జీఎస్టీ పరిహారం వాటా పెరిగిందని, కానీ ఆ మేరకు చెల్లింపులు చేసేందుకు జీఎస్టీ పరిహార నిధిలో సరిపడా నిధులు లేవని స్పష్టం చేశారు. 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాలకు జీఎస్టీ పరిహారం కింద కేంద్రం ఇంకా రూ.51,798 కోట్లు బకాయి ఉన్నదని మంత్రి వెల్లడించారు.
మధుమేహాన్ని ఇలా అదుపులో పెట్టుకోండి..!
ప్రెషర్ కుక్కర్లో వండే అన్నం ఆరోగ్యానికి మంచిదేనా..?
గర్భ సంచిలో గడ్డలు ఎందుకు వస్తాయి.. అలా వస్తే పిల్లలు పుడతారా ?
అతని ఎత్తు మూడు అడుగులే.. కానీ ఆత్మవిశ్వాసం ఆకాశమంత..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..