(AP rains) విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వర్షం గండం మళ్లీ తప్పేట్లు లేదు. మరోసారి రాష్ట్రానికి వర్షసూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికీ కొన్ని జిల్లాల్లో చెదురుముదురు వర్షాలు కురుస్తున్నాయి. సీమ ప్రాంతంలో పిడుగులతో కూడిన వానలు పడుతున్నట్లుగా సమాచారం. అటు అనంతపురం జిల్లాలో భారీగా వానలు కురుస్తున్నాయి.
కడప, అనంతపురం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ తెలిపింది. నెల్లూరు జిల్లాలోని పశ్చిమ భాగాల్లో భారీ వర్షాలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో తేలికపాటి, మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ నిపుణులు చెప్తున్నారు. ఉత్తర కోస్తాలో తేలికపాటి వర్షాలు, కొన్నిచోట్ల ఉరుములతో కూడిన వానలు పడే అవకాశాలున్నాయి. రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దక్షిణ కోస్తాలో కూడా తేలికపాటి వానలు కురిసే వీలున్నది. ఎల్లుండి ఒకటి రెండు చోట్ల వానలు కురుస్తాయి. కడప జిల్లాలోని పలు ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశాలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
వైరస్‌తో ఊబకాయులకు యమ డేంజర్ అంటున్న నిపుణులు
వాట్సాప్‌లో హలో మమ్మీ! హలో డాడీ.. అంటూ వచ్చే మెసేజ్‌లతో జాగ్రత్త!.. ఎందుకంటే..
వేరియంట్‌కు స్పానిష్ ఫ్లూకి ఉన్న పోలిక ఏంటి?
అక్కడి నీళ్లలో తేలియాడొచ్చు.. ఈత రాకున్నా అస్సలు మునగరు : వైరల్ వీడియో
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..