(Pilli subash coments) న్యూఢిల్లీ : పోలవరం జాతీయ ప్రాజెక్టు అని, కేంద్రంపై మరింత బాధ్యత ఉన్నదని వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ స్పష్టం చేశారు. అభివృద్ధి విషయంలో రాష్ట్రంపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపుతున్నదని మండిపడ్డారు. గురువారం పార్లమెంట్‌లోని మీడియా పాయింట్లో ఆయన మాట్లాడారు. రూ.55 వేల కోట్ల సవరించిన అంచనాలను ఆమోదించాలని ఆయన కేంద్రాన్ని కోరారు. పోలవరం ప్రాజెక్ట్ ప్రధాన కార్యాలయాన్ని రాజమండ్రికి తరలించాలని డిమాండ్ చేశారు. కేంద్రం వెంటనే బకాయిలు విడుదల చేయాలని అన్నారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో నీటిపారుదల రంగానికి మాత్రమే నిధులు కేటాయిస్తామని కేంద్ర జలవనరుల శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు సోమవారం రాజ్యసభలో చెప్పారు. వైసీపీ ఎంపీ వీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ మేరకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. 2017-18 ధరల ప్రకారం టెక్నికల్ అడ్వైజరీ కమిటీ (టీఏసీ) సమావేశంలో సవరించిన అంచనా వ్యయం రూ.55,548 కోట్లకు ఆమోదం పొందినదని తెలిపారు. అయితే రివైజ్డ్ కాస్ట్ కమిటీ నీటిపారుదల రంగానికి రూ.35,950 కోట్లు మాత్రమే ఆమోదించి 2020 మార్చిలో నివేదికను సమర్పించిందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) తుది సిఫారసుల తర్వాత పెట్టుబడులకు అనుమతి తీసుకుంటామని పేర్కొన్నారు. పోలవరం పనులకు సంబంధించి 2014 నుంచి కేంద్రం రూ.11,600 కోట్లు రీయింబర్స్ చేసిందని, తాజాగా మరో రూ.711 కోట్లు పీపీఏ, సీడబ్ల్యూసీ సిఫారసు చేసిందని తెలిపారు.
వైరస్‌తో ఊబకాయులకు యమ డేంజర్ అంటున్న నిపుణులు
వాట్సాప్‌లో హలో మమ్మీ! హలో డాడీ.. అంటూ వచ్చే మెసేజ్‌లతో జాగ్రత్త!.. ఎందుకంటే..
వేరియంట్‌కు స్పానిష్ ఫ్లూకి ఉన్న పోలిక ఏంటి?
అక్కడి నీళ్లలో తేలియాడొచ్చు.. ఈత రాకున్నా అస్సలు మునగరు : వైరల్ వీడియో
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..