(Gorantla Question) విజయవాడ : ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను టీడీపీ సీనియర్ నేత గోరంట్ల టార్గెట్ చేశారు. రాష్ట్రంలో వైద్యం పడకేసిందని, దవాఖానలకు సుస్తు చేసిందని, రోగులు, వైద్యుల ఇబ్బందులు పట్టించుకోవడం లేదని టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్విట్టర్ వేదికగా జగన్ సర్కార్‌ను ఏకిపారేశారు. ఏపీలో ఆరోగ్య మంత్రి ఎవరు? కోటి రూపాయల ప్రశ్న..? బహుశా దేశంలోనే ఇలాంటి మంత్రి ఎవరు ఉండి ఉండరు. ఒకవేళ ఆరోగ్య మంత్రి ఎవరో తెలిస్తే సదరు మంత్రి ఆఫీసుకు వెళ్లి ఆరోగ్య శాఖ బాధ్యతను గుర్తుచేద్దాం అంటూ ట్విట్టర్లో సెటైర్లు వేశారు.
సరైన వసతులు లేకుండా ప్రభుత్వ ఆస్పత్రిలో పని చేయడం ఎలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌గారు అంటూ మరో ట్విట్టర్లో ప్రశ్నించారు. దవఖానాల్లో రోగుల ఇబ్బందులు పట్టించుకోకుండా.. డాక్టర్ల ఇబ్బందులు పట్టించుకోకుండా ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని ఆయన మండిపడ్డారు. ఆరోగ్య శాఖ మొద్దునిద్ర పోతున్నదని గోరంట్ల వ్యాఖ్యానించారు.
కోటి రూపాయల ప్రశ్న..!
— Gorantla butchaiah choudary (@GORANTLA_BC) December 8, 2021
ఏపీ కి ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు?
బహుశా దేశంలో నే ఇలాంటి మంత్రి ఎవరు ఉండి ఉండరు.. ఒక వేళ తెలిస్తే సదరు మంత్రి ఆఫీసు కి వెళ్లి ఆరోగ్య శాఖ బాధ్యత ని గుర్తు చేద్దాం!#గోరంట్ల🔥#FailedCMjagan#WhoIsTheHealthMinisterOfAp_NationWantsToKnow
వైరస్‌తో ఊబకాయులకు యమ డేంజర్ అంటున్న నిపుణులు
వాట్సాప్‌లో హలో మమ్మీ! హలో డాడీ.. అంటూ వచ్చే మెసేజ్‌లతో జాగ్రత్త!.. ఎందుకంటే..
వేరియంట్‌కు స్పానిష్ ఫ్లూకి ఉన్న పోలిక ఏంటి?
అక్కడి నీళ్లలో తేలియాడొచ్చు.. ఈత రాకున్నా అస్సలు మునగరు : వైరల్ వీడియో
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..