(Farmers Pada yatra) చిత్తూరు : అమరావతిని రాష్ట్ర రాజధానిగా చేయాలంటూ గత 36 రోజులుగా రైతులు చేస్తున్న పాదయాత్ర ఇవాళ చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించింది. ఇవాళ దాదాపు 16 కిలోమీటర్లు యాత్ర కొనసాగించి చింతలపాలెంలో బస చేయనున్నారు. న్యాయస్థానం టు దేవస్థానం పేరిట చేపడుతున్న ఈ యాత్రకు అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. నవంబరు 1 న ఈ యాత్ర తుళ్లూరు నుంచి ప్రారంభమైంది. ఈ నెల 15 కల్లా తిరుమలకు చేరుకోనున్నది. ఈ నెల 15, 16 తేదీల్లో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు దాదాపు 500 మంది రైతులు సిద్ధమయ్యారు.
రైతుల మహాపాదయాత్ర 37వ రోజూ కొనసాగుతున్నది. నెల్లూరు జిల్లా పరిధిలోని వెంకటగిరి నుంచి కొనసాగిన పాదయాత్ర వల్లివేడు మీదుగా చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించింది. శ్రీకాళహస్తి మండలం జగ్గరాజుపల్లె వద్ద రైతులకు స్థానికులు, టీడీపీ నేతలు అమర్నాథ్ రెడ్డి, పులవర్తి నాని, బొజ్జల సుధీర్‌రెడ్డి, తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. రైతులతో కలిసి వాంపల్లె వరకు నడిచిన సుధీర్‌రెడ్డి సొమ్మసిల్లి పడిపోవడంతో.. ఆయనను చికిత్స నిమిత్తం శ్రీకాళహాస్తికి తరలించారు. కాగా, తిరుపతిలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు రైతులు ఉద్యుక్తులవుతున్నారు. అయితే, బహిరంగ సభకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో.. రైతులు హైకోర్టును ఆశ్రయించే పనిలో నిమగ్నమై ఉన్నారు.
మధుమేహాన్ని ఇలా అదుపులో పెట్టుకోండి..!
ప్రెషర్ కుక్కర్లో వండే అన్నం ఆరోగ్యానికి మంచిదేనా..?
గర్భ సంచిలో గడ్డలు ఎందుకు వస్తాయి.. అలా వస్తే పిల్లలు పుడతారా ?
అతని ఎత్తు మూడు అడుగులే.. కానీ ఆత్మవిశ్వాసం ఆకాశమంత..
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..