హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ రైఫిల్ అసోసియేషన్(టీఆర్ఏ)ఆధ్వర్యంలో స్పోర్ట్స్ షూటింగ్ కాంక్లేవ్ హైదరాబాద్లో జరుగనుంది. ఈనెల 26 నుంచి మొదలయ్యే భేటీ నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నంబర్12లోని టీఆర్ఏ కార్యాలయం వేదికగా జరుగనుంది. తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా షూటింగ్ క్రీడాభివృద్ధి, ప్రోత్సాహం, భవిష్యత్ కార్యాచరణపై సమగ్ర చర్చ జరుగనుంది.
గ్రామీణ స్థాయిలో క్రీడాకారుల భాగస్వామ్యాన్ని పెంపొందించడం, షూటింగ్ క్రీడాభివృద్ధి, ప్రోత్సాహం, భవిష్యత్ కార్యాచరణపపై సమగ్ర చర్చలు జరుపడంపై ప్రధానంగా చర్చ జరుగనుంది. జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రాష్ట్ర షూటింగ్ వ్యవస్థను తీర్చిదిద్దడం వంటి అంశాలపై లోతైన చర్చలు జరుగనున్నాయి. ఈ భేటీకి సీనియర్ ఐఏఎస్ అధికారులు, సీనియర్ సివిల్ సర్వీసెస్ అధికారులు హాజరు కానున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.