(Anitha coments) అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై టీడీపీ నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. మామూలుగా అమ్మితే డబ్బు ఎక్కువగా రావడం లేదని యోచించిన సర్కార్.. ఐఏఎస్ అధికారులను పెట్టి మద్యం అమ్మకాలు జరిపిస్తుందని దుయ్యబట్టారు. తాజాగా ముఖ్యమంత్రి జగన్ ఐడియా అదిరిపోయిందంటూ టీడీపీ నేత వంగలపూడి అనిత ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. ‘మీ మద్యం వ్యాపారానికి ఇప్పటివరకు ఉపాధ్యాయులను వాడుకున్నావు అనుకుంటే, ఇప్పుడు ఐఏఎస్ అధికారులకు కూడా బరిలోకి దించావా జగన్ అన్నా. మీ మేధోశక్తికి, వ్యాపార దృక్పథానికి శతకోటి వందనాలు. ఇది మా ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం’ అంటూ విమర్శలు చేశారు.
మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కూడా మద్యం అమ్మకాలను విమర్శించారు. రాష్ట్రంలో రక్షణ కరవైంది, కష్టాల్లో ఉన్న ప్రజానీకాన్ని ఆదుకోవాల్సింది పోయి, ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. చివరకు ఐఏఎస్‌లే మద్యం అమ్మే పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు. శాంతి భద్రతలను కాపాడటంలో జగన్ ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రభుత్వ అనాలోచిత చర్యల కారణంగా రైతులు పాదయాత్ర చేస్తుండగా.. తాజాగా ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారని గుర్తుచేశారు.
మీ మద్యం వ్యాపారానికి ఇప్పటి వరకు ఉపాధ్యాయులను వాడుకున్నావు అనుకుంటే , ఇప్పుడు IAS అధికారులను కూడా బరిలోకి దించావా జగన్ అన్నా. మీ మేధోశక్తికి , వ్యాపార దృక్పధానికి శతకోటి వందనాలు.
— Anitha Vangalapudi (@Anitha_TDP) December 8, 2021
ఇది మా ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం.🤦♀️🤦♀️🤦♀️
వైరస్‌తో ఊబకాయులకు యమ డేంజర్ అంటున్న నిపుణులు
వాట్సాప్‌లో హలో మమ్మీ! హలో డాడీ.. అంటూ వచ్చే మెసేజ్‌లతో జాగ్రత్త!.. ఎందుకంటే..
వేరియంట్‌కు స్పానిష్ ఫ్లూకి ఉన్న పోలిక ఏంటి?
అక్కడి నీళ్లలో తేలియాడొచ్చు.. ఈత రాకున్నా అస్సలు మునగరు : వైరల్ వీడియో
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..