(Accident at Vizag) విశాఖ : మధురవాడలో విషాదం చోటుచేసుకున్నది. మోటార్ బైక్‌పై వెళ్తున్న వారిని లారీ ఢీకొట్టడంతో బైకుపై ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉన్నది. మధురవాడ జాతీయ రహదారిపై గురువారం ఈ రోడ్డు ప్రమాదం జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. పోలిపల్లి రమణ తన భార్య, కుమార్తెతో భోగాపురం మండలం పోలిపల్లి గ్రామంలో జరిగిన ఒక శుభకార్యానికి హజరై తిరిగి ఇంటికి వస్తున్నారు. విశాఖ మధురవాడ సమీపంలోని చంద్రంపాలెం వద్దకు రాగానే వీరు ప్రయాణిస్తున్న బైకును వెనుకనుంచి వేగంగా వచ్చిన లారీ ఒకటి ఢీకొట్టింది. దాంతో బైకుపై ఉన్న ముగ్గురు అక్కడికక్కడి చనిపోయారు. బైకును ఢీకొట్టిన తర్వాత కొద్ది దూరం వరకు వారిని లారీ లాక్కెల్లింది. మృతులను పోలిపల్లి రమణ, ఆయన భార్య రమాభాయ్ అలియాస్ లక్ష్మి, కుమార్తె దంతి కుమారిగా గుర్తించారు. వీరు విశాఖపట్నంలోని రెల్లి వీధి ప్రాంతంలో నివసిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ ఒడిశా నుంచి అచ్యుతాపురం వెళ్తున్నది. పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు.
వైరస్‌తో ఊబకాయులకు యమ డేంజర్ అంటున్న నిపుణులు
వాట్సాప్‌లో హలో మమ్మీ! హలో డాడీ.. అంటూ వచ్చే మెసేజ్‌లతో జాగ్రత్త!.. ఎందుకంటే..
వేరియంట్‌కు స్పానిష్ ఫ్లూకి ఉన్న పోలిక ఏంటి?
అక్కడి నీళ్లలో తేలియాడొచ్చు.. ఈత రాకున్నా అస్సలు మునగరు : వైరల్ వీడియో
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..