మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Warangal-city - Sep 16, 2020 , 05:21:13

వరంగల్‌ నగర సమగ్రాభివృద్ధికి కృషి

వరంగల్‌ నగర సమగ్రాభివృద్ధికి కృషి

  • ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌

వరంగల్‌, సెప్టెంబర్‌15: గ్రేటర్‌ వరంగల్‌ సమ గ్రాభివృద్ధికి కృషి చేస్తానని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ అన్నా రు. మంగళవారం నగర మేయర్‌ గుండా ప్రకాశ్‌ రావు హైదరాబాద్‌లో ఆయనతో సమావేశమ య్యారు. రోజురోజుకూ విస్తరిస్తున్న నగరంతో పా టు పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగు ణంగా అభివృద్ధి జరుగాల్సిన అవసరం ఉందని మేయర్‌, వినోద్‌కుమార్‌ దృష్టికి తీసుకెళ్లారు. ము ఖ్యంగా కొత్త మాస్టర్‌ ప్లాన్‌ ఆవశ్యకతపై చర్చించా రు. ఇప్పటికే జిల్లా ప్రజాప్రతినిధులు, మంత్రులు మాస్టర్‌ ప్లాన్‌పై సమగ్రంగా చర్చించారని, పట్టణా భివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్‌ సూత్రప్రాయంగా ఆ మోదం తెలిపారని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ గ్రీన్‌సి గ్నల్‌ ఇవ్వాల్సి ఉందని ప్రకాశ్‌రావు వివరించారు. వరంగల్‌ రైల్వే గేట్‌పై ఆర్వోబీ నిర్మించగా, నిర్వాసి తుల ఇచ్చే పరిహారానికి రూ.9.80 కోట్లు,  దేశా యిపేటలో నిర్మించిన షాదీఖానకు రూ.1.80 కోట్లు కార్పొరేషన్‌ నుంచి చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్రభుత్వం నుంచి పరిపాలన అనుమ తులు ఇప్పించాలని మేయర్‌ కోరారు. అలాగే ఖాళీగా ఉన్న 452 పారిశుధ్య కార్మికుల నియామ కం, మూడు డిప్యూటీ కమిషనర్ల పోస్టుల భర్తీకి  అనుమతులు  ఇప్పించాలని అన్నారు. స్పందించి న వినోద్‌కుమార్‌ వరంగల్‌ స్వరూపంపై పూర్తి అవగాహన ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొత్త మాస్టర్‌ ప్లాన్‌ విషయంతో తనదైన ముద్ర వేయ నున్నారని అన్నారు. దీంతోపాటు ఇతర అంశాల ను సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకు పోయి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని బోయినపల్లి హామీ ఇచ్చారు.


logo