Salman Khan | సల్మాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటన.. కస్టడీలో ఉన్న నిందితుడు ఆత్మహత్య
Salman Khan | బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) ఇంటి వద్ద కాల్పులు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్టై కస్టడీలో ఉన్న నిందితుల్లో ఒకరు తాజాగా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు బుధవారం వెల్లడించారు.
Salman Khan | బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) ఇంటి వద్ద కాల్పులు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దర్యాప్తును ముమ్మరంగా సాగిస్తున్నారు. ఇందులో భాగంగా కొంతమంది నిందితుల్ని అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నారు. అయితే, కస్టడీలో ఉన్న నిందితుల్లో ఒకరు తాజాగా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు బుధవారం వెల్లడించారు.
పోలీసు కస్టడీలో ఉన్న అనూజ్ తపన్ (Anuj Thapan) అనే 32ఏళ్ల నిందితుడు బుధవారం మధ్యాహ్నం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్రమత్తమైన జైలు అధికారులు అతడిని వెంటనే సమీపంలోని జీటీ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించినట్లు పోలీసులు వెల్లడించారు. పంజాబ్‌కు చెందిన అనూజ్‌ను ఏప్రిల్ 16న పోలీసులు అరెస్ట్ చేశారు.
గత నెల 14న ముంబైలోని బాంద్రా ఏరియాలోని సల్మాన్ ఖాన్ నివాసం ఉండే గెలాక్సీ అపార్టుమెంట్ (Galaxy Apartments) దగ్గర కాల్పులు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. బైక్‌పై వచ్చిన ఇద్దరు ఆగంతకులు మూడు రౌండ్ల కాల్పులు జరిపి పారిపోయారు. కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అపార్ట్మెంట్స్ వద్ద సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి ఆ దృశ్యాల ఆధారంగా.. నిందితుల్ని గుజరాత్లో అదుపులోకి తీసుకున్నారు. కాల్పులు జరిపిన నిందిలుల్ని విక్కీ గుప్తా, సాగర్ పాల్గా గుర్తించారు. అనంతరం వీరికి ఆయుధాలు సరఫరా చేశారన్న ఆరోపణలపై అనూజ్ తపన్, సోను సుభాశ్ చందర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
Salman Khan residence firing case | Accused Anuj Thapan who attempted suicide in custody has been declared dead by doctors at the hospital: Mumbai Police https://t.co/3OMrikn0nP
— ANI (@ANI) May 1, 2024
Also Read..
Bomb Threat | ఢిల్లీ-ఎన్సీఆర్లో 60కిపైగా పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. ఉలిక్కిపడ్డ రాజధాని ప్రాంతం
China | చైనాలో కుప్పకూలిన రోడ్డు.. 19 మంది మృతి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Avocado | రోజూ అవకాడో, మామిడిపండ్లను తింటే గుండె పదిలం.. అధ్యయనంలో వెల్లడి..
Health Tips | ఒంటి నొప్పులా.. ఇన్ఫెక్షన్లు కూడానా.. సమస్య ఏదైనా పసుపుతో పరిష్కారం..!
Jensen Huang | ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ రాజీనామా..!
Crude oil tanker hit | యూఏఈ తీరంలో చమురు ట్యాంకర్‌పై దాడి.. 19 మంది భారతీయ నావికులు సురక్షితం
రేపటి నుండి ఎంజీయూలో దక్షిణ భారత చరిత్రకారుల సమాగమం
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

