Mallikarjun Kharge | ముస్లింలకే ఎక్కువ మంది పిల్లలుంటారా..? నాకు ఐదుగురు సంతానం : మోదీ వ్యాఖ్యలకు ఖర్గే కౌంటర్
Mallikarjun Kharge | లోక్సభ ఎన్నికల్లో (Lok Sabha Elections 2024) ఇండియా కూటమి (INDIA Bloc) మెజారిటీ దిశగా దూసుకెళ్తోందని పసిగట్టిన ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) నిరుత్సాహానికి గురవుతున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) వ్యాఖ్యానించారు.
Mallikarjun Kharge | లోక్సభ ఎన్నికల్లో (Lok Sabha Elections 2024) ఇండియా కూటమి (INDIA Bloc) మెజారిటీ దిశగా దూసుకెళ్తోందని పసిగట్టిన ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) నిరుత్సాహానికి గురవుతున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) వ్యాఖ్యానించారు. అందుకే మంగళసూత్రం, ముస్లింలు (Muslims) అంటూ ఏవేవో మాట్లాడుతున్నారని విమర్శించారు.
ఛత్తీస్గఢ్లోని జాంజ్గిర్-చంపా జిల్లాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు. ‘మేం మెజారిటీ దిశగా అడుగులు వేస్తున్నాం. అందుకే మోదీ మంగళసూత్రం, ముస్లింల గురించి మాట్లాడుతున్నారు. ప్రజల సంపదను దొంగిలించి ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారికి ఇస్తామని అంటున్నారు. పేదలకు ఎప్పుడూ ఎక్కువ మందే పిల్లలు ఉంటారు. పేదల వద్ద సంపద లేదు కాబట్టే అధిక సంతాన్ని కలిగి ఉంటారు. కానీ మీరు (ప్రధానమంత్రి మోదీని ఉద్దేశిస్తూ) ముస్లింల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు..? ముస్లింలకు మాత్రమే ఎక్కువ మంది సంతానం ఉంటారా..? ముస్లింలు కూడా ఈ దేశానికి చెందినవారే. నాకూ ఐదుగురు సంతానం. నా తండ్రికి నేను ఒక్కడినే. గతంలో జరిగిన అగ్నిప్రమాదంలో అమ్మ, చెల్లి, మరో బంధువు చనిపోయారు. మోదీ ప్రకటనలతో తప్పుదారి పట్టొద్దు. అందరినీ కలుపుకుని వెళితేనే దేశాన్ని అభివృద్ధి చేయగలం’ అని ఖర్గే అన్నారు.
Also Read..
Chiranjeevi | పసి పిల్లలను పని పిల్లలుగా చేయొద్దు.. మే డే సందర్భంగా చిరంజీవి స్పెషల్ వీడియో
Bomb Threat | ఢిల్లీ-ఎన్సీఆర్లో 60కిపైగా పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. ఉలిక్కిపడ్డ రాజధాని ప్రాంతం
China | చైనాలో కుప్పకూలిన రోడ్డు.. 19 మంది మృతి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

