హైదరాబాద్ : రాష్ట్రంలో రోజురోజుకు కాంగ్రెస్ గుండాల(Congress goons) దాడులు పెరిగిపోతున్నాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకొని బీఆర్ఎస్(BRS) నాయకులే లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నారు. తప్పుడు కేసులు పెట్టి జైళ్లకు పంపిస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ నాయకుడు బుర్ర శంకర్ గౌడ్‌పై(Burra Shankar Goud) మంత్రి శ్రీధర్ బాబు అనుచరులు దాడి(Attacked) చేశారు.
పెద్దపల్లి జిల్లా బేగంపేట గామంలోని హమాలీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మేడే వేడుకలకు ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్లిన బేగంపేట సర్పంచ్ బుర్ర పద్మ భర్త శంకర్ గౌడ్ పై అదే గ్రామానికి చెందిన ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అనుచరుడు దాసరి శివ కుమార్, దాసరి శ్రీనివాస్ అనే గుండాలు ఆకస్మికంగా దాడి చేశారు. ఈ దాడిలో శంకర్ గౌడ్ ఎడమ కన్నుకు తీవ్ర గాయమైంది. వెంటనే అతడిని బీఆర్ఎస్ కార్యకర్తలు హాస్పిటల్‌కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.