Special Trains | సికింద్రాబాద్ – సంత్రగాచి మధ్య ప్రత్యేక రైళ్లు నడిపించినున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్-సంత్రగాచి (07243) మధ్య జూన్ 30 వరకు ప్రతి ఆదివారం, సంతగ్రాచి – సికింద్రాబాద్ (07235) మధ్య జులై 2 వరకు ప్రతి మంగళవారం ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు తెలిపింది. సికింద్రాబాద్ – సంత్రగాచి రైలు ఆదివారం రోజున రాత్రి 11.40 గంటలకు బయలుదేరి మూడోరోజు ఉదయం 5.50 గంటలకు సంత్రగాచికి చేరుతుంది.
సంత్రగాచి-సికింద్రాబాద్ రైలు మంగళవారం మధ్యాహ్నం 12.20 గంటలకు బయలుదేరి.. మరుసటిరోజు మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్కు చేరుతుంది. ఆయా రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, ఎలమంచి,, అనాకపల్లి, దువ్వాడ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, బెర్హంపూర్, ఖుర్దా రోడ్, భువనేశ్వర్, కటక్, బాలాసోర్, ఖరగ్పూర్ స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయని దక్షిణ మధ్య రైల్వే వివరించింది.