Khammam victims | ఎక్కడికి పోవాలో అర్థమైతలేదు సారూ.. చంటిపాపతో రోడ్డున పడ్డ బాధిత మహిళ ఆవేదన
Khammam Victims | ఓ వైపు ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులుగా మారిన బాధితులను అధికారులు భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. కేటీఆర్ వస్తున్నారు.. మీరిక్కడ ఉండకూడదు వెళ్లిపోమని చెప్తున్నారు.
Khammam victims | ఖమ్మం అర్బన్ వెలుగుమట్ల భూదాన్ భూముల్లో పేదలు ఎంతో కష్టపడి కట్టుకున్నఇళ్లను కాంగ్రెస్ సర్కార్ బుల్డోజర్లతో కూల్చివేస్తున్న విషయం తెలిసిందే. కూల్చివేతలతో నిరాశ్రయులుగా మారిన పేదలను ఖమ్మంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించనున్నారు. ఈ నేపథ్యంలో ఓ వైపు ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులుగా మారిన బాధితులను అధికారులు భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. కేటీఆర్ వస్తున్నారు.. మీరిక్కడ ఉండకూడదు వెళ్లిపోమని చెప్తున్నారు.
కూల్చివేతల్లో ఇల్లు కోల్పోయి చంటి పాపతో రోడ్డున పడ్డ ఓ మహిళ మాట్టాడుతూ.. ఎక్కడికి పోవాలో అర్థం కావట్లేదు సార్.. రాజకీయ నాయకులు వస్తున్నారు.. కేటీఆర్ సార్ వస్తున్నారు మళ్లీ ఇబ్బంది అయితది.. ఇక్కడుంటే మీకే ఇబ్బంది.. తర్వాత ఏదో ఒకటి చూపిస్తామని అధికారులు చెప్తున్నరని ఆవేదన వ్యక్తం చేసింది.
మేం చిన్నపాపను పట్టుకుని మూడు రోజులు నుంచి ఇక్కడే ఉంటున్నాం. అన్నం లేదు ఏం లేదు.. మా ఇల్లు పోయింది.. ఎక్కడికి పోవాలో అర్థం కావడం లేదు సార్. మాకేం లేదు.. మేం కులాంతర వివాహం చేసుకున్నాం. అటు మా తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదు.. ఇటు అత్తామామ అంగీకరించడం లేదు.. ఇక చేసేదేమి లేక సామాను తీసుకొని వచ్చి ఇక్కడుంటున్నాం. కిరాయిలు కట్టుకోవాలంటే మాతోని అవడం లేదు.. చిన్నబాబు ఉన్నడు కదా ఇబ్బంది అవుతుందంటూ తన గోడు వెళ్లబోసుకుంది.
కేటీఆర్ వస్తున్నాడు మీరు ఇక్కడ ఉండకూడదు వెళ్లిపోమని అధికారులు చెప్తున్నారు
వెనుకబడ్డ కాంగ్రెస్ పార్టీని ముందుకు తెస్తే మమల్ని వెనక్కి నెడుతున్నారు
మూడు రోజులుగా చిన్న పాపతో రోడ్డు పక్కన ఉంటున్నాము
ఖమ్మం వెలుగుమట్ల కూల్చివేతల్లో ఇల్లు కోల్పోయిన బాధితురాలి ఆవేదన https://t.co/9seqyTbn2n pic.twitter.com/JIRpyWSZrB
— Telugu Scribe (@TeluguScribe) February 26, 2026
Read Also :
Virosh Wedding | ఒక్కటైన విరోష్: రాజస్థాన్‌లో వైభవంగా విజయ్-రష్మిక వివాహం!
Tirumala | తిరుమల ఘాట్ రోడ్డుపై ప్రమాదం.. ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
Bhu Bharati | భూ భారతిలో రెవెన్యూ సదస్సు అప్లికేషన్లు మాయం
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

