NHRC Notices | కర్నూలు బస్సు దుర్ఘటనపై జిల్లా ఎస్పీకి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు జారీ
NHRC Notices | ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు సమీపంలో జాతీయ రహదారి 44పై జరిగిన ఘోర బస్సు అగ్నిప్రమాదంలో 20 మందికి పైగా ప్రయాణికులు సజీవదహనం పై జాతీయ మానవహక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది.
అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు ( Kurnool ) సమీపంలో జాతీయ రహదారి 44పై జరిగిన ఘోర బస్సు అగ్నిప్రమాదంలో 20 మందికి పైగా ప్రయాణికులు సజీవదహనం ( Fire accident ) పై జాతీయ మానవహక్కుల కమిషన్ ( NHRC ) తీవ్రంగా స్పందించింది. పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని జిల్లా ఎస్పీకి నోటీసులు జారీ చేసింది.
తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు కె. కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి బస్సు ప్రమాదంపై ఎన్హెచ్ఆర్సీకి, కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రిత్వశాఖకు ఫిర్యాదు చేశారు. అయితే కేంద్ర మంత్రిత్వ శాఖ ఎన్హెచ్ఆర్సీకి సమగ్ర యాక్షన్ టేకన్ రిపోర్టు( ఏటీఆర్ )ను సమర్పించినా ఇంకా ప్రమాదానికి సంబంధించి అత్యంత కీలకమైన ప్రశ్నలకు మాత్రం సమాధానం ఇవ్వలేదని జగదీశ్వర రెడ్డి తెలిపారు.
రీజాయిండర్కు స్పందించిన కమిషన్ కర్నూలు జిల్లా పోలీసు సూపరింటెండెంట్కు అధికారిక నోటీసు జారీ చేసిందని అన్నారు. ఫిర్యాదులో చేసిన ఆరోపణలపై సమగ్ర విచారణ నిర్వహించాలని, నాలుగు వారాల్లోపు ఏటీఆర్ను సమర్పించాలని, మానవ హక్కుల పరిరక్షణ చట్టం, 1993లోని సెక్షన్ 12, సెక్షన్ 13 ప్రకారం విచారణ చేపట్టాలని ఆదేశించిందని వెల్లడించారు.
ఇది కేవలం ప్రమాదం కాదు. 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన ఘటనను సాధారణ రోడ్డు ప్రమాదంగా చూడలేము. ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 జీవించే హక్కుకు సంబంధించిన అంశం. ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు న్యాయం జరగాలి. బాధ్యులెవరో బయటపడాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

