May Day : మేడే సందర్భంగా మోదీ సర్కార్‌పై సీపీఎం నేత బృందా కారత్ బుధవారం తీవ్రస్ధాయిలో విమర్శలు గుప్పించారు. దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయని బీజేపీ పాలకుల దమనకాండపై ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని ఆమె అభ్యర్ధించారు.
మోదీ ప్రభుత్వం కార్మికుల పొట్టకొడుతూ వారి హక్కులను కాలరాస్తోందని దుయ్యబట్టారు. కార్మికులకు మేలు చేయని కాషాయ ప్రభుత్వం పెట్టుబడిదారులకు వత్తాసు పలుకుతోందని అన్నారు. పదేండ్ల తన పాలన కేవలం ట్రైలర్ మాత్రమేనని పూర్తి సినిమా ముందుందని ప్రధాని మోదీ చెబుతున్నారని అన్నారు.
తమ హక్కులను పూర్తిగా కాలరాసిన పాలన ట్రైలర్ అయితే ఇక రాబోయే రోజుల్లో ఏం జరగుతుందో తలుచుకుంటేనే భయం వేస్తోందని వ్యవసాయ కార్మికులు చెబుతున్నారని ఆమె పేర్కొన్నారు. మోదీ పాలన అన్ని రంగాల్లో విఫలమైందని బృందా కారత్ విమర్శించారు.
Read More :
Harish Rao | కార్మిక లోకానికి ‘మే డే’ శుభాకాంక్షలు : మాజీ మంత్రి హరీశ్‌రావు