బుధవారం 21 అక్టోబర్ 2020
Warangal-city - Jul 23, 2020 , 02:20:45

ఉమ్మడి జిల్లాకు 28 మంది డీటీల కేటాయింపు

 ఉమ్మడి జిల్లాకు  28 మంది డీటీల కేటాయింపు

హన్మకొండ, జూలై 22 : వరంగల్‌ ఉమ్మడి జిల్లాకు 28 మంది డిప్యూటీ తహసీల్దార్లను (డీటీలు) కేటాయించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2016లో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా విడుదల చేసిన నోటిఫికేషన్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేశారు. వీరికి జనవరిలో హైదరాబాద్‌లోని అకాడమీలో శిక్షణ ఇచ్చారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారి నుంచి వరంగల్‌ ఉమ్మడి జిల్లాకు 28 మందిని కేటాయించారు. జిల్లాలో రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వరంగల్‌ ఉమ్మడి జిల్లా నోడల్‌ ఆఫీసర్‌ , వరంగల్‌ అర్బన్‌ కలెక్టర్‌ ఆధ్వర్యంలో వీరందరికీ జిల్లాలు కేటాయించనున్నారు. 


logo