గురువారం 26 నవంబర్ 2020
Wanaparthy - Nov 17, 2020 , 05:09:38

ఆపన్నుల మోములో చిరునవ్వు కోసం..

ఆపన్నుల మోములో చిరునవ్వు కోసం..

  • అంబులెన్సులను ప్రారంభించిన మంత్రి నిరంజన్‌రెడ్డి 

వనపర్తి : టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్‌ ఎ స్మైల్‌ పిలుపులో భాగంగా ఇచ్చిన రెండు అంబులెన్సులను సోమవారం హైదరాబాద్‌లో మంత్రుల నివాస సముదాయంలో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి  పూజచేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గిఫ్ట్‌ ఎ స్మైల్‌ పిలుపులో భాగంగా మూడు అంబులెన్సులకు గానూ గతంలో ఒకటి వనపర్తి జిల్లా దవాఖానకు కేటాయించామన్నారు. మిగిలిన రెండింటిని కూడా ప్రారంభించామని మంత్రి చెప్పారు. వెంటిలేటర్లు, ఆక్సిజన్‌తో కూడిన అధునాతన అంబులెన్స్‌లు అందుబాటులోకి వచ్చాయని, అత్యవసర సమయాల్లో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఉపయోగపడుతాయని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.