e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home News సాలిడ్ స్టేట్ బ్యాటరీ.. ఎలక్ట్రిక్ వాహనాల్లో గేమ్ చేంజర్?!

సాలిడ్ స్టేట్ బ్యాటరీ.. ఎలక్ట్రిక్ వాహనాల్లో గేమ్ చేంజర్?!

సాలిడ్ స్టేట్ బ్యాటరీ.. ఎలక్ట్రిక్ వాహనాల్లో గేమ్ చేంజర్?!

న్యూఢిల్లీ: ఇప్ప‌టికే పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు భ‌గ్గుమని మండుతున్నాయి.. పెట్రోల్ లేదా డీజిల్ వినియోగ వాహ‌నాల స్థానే ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను కొనుగోలు చేయాలంటే వాటి ధ‌ర త‌డిసి మోపెడ‌య్యేలా ఉంది.. దీనికి ఆయా ఎల‌క్ట్రిక్ వాహనాల్లో వాడే బ్యాటరీ కారణం. ఇప్ప‌టికే ఆటోమొబైల్ కంపెనీలు బ్యాటరీ వ్యయం తగ్గించుకుని వాహ‌నాల ధ‌రలను అందుబాటులోకి తేవాలని సూచిస్తున్నాయి.

బ్యాట‌రీల వ్య‌యం త‌గ్గింపున‌కు మార్గాలు లేక‌పోలేదు. అందులో ఒకటి సాలిడ్‌ స్టేట్‌ బ్యాటరీల వినియోగం ఒక‌టి. పూర్తి స్థాయిలో స‌క్సెస్ అయితే, విద్యుత్ వాహ‌నాల్లో సాలిడ్ స్టేట్ బ్యాట‌రీ గేమ్ చేంజ‌ర్ కానున్న‌ద‌ని నిపుణులు అభిప్రాయ ప‌డుతున్నారు.

సాలిడ్ స్టేట్ బ్యాటరీ.. ఎలక్ట్రిక్ వాహనాల్లో గేమ్ చేంజర్?!

సాలిడ్ స్టేట్ బ్యాట‌రీల‌ నుంచి విద్యుత్ ఉత్ప‌త్తి చేయ‌డానికి టెక్నాల‌జీ ఎంత‌వ‌ర‌కు చేయూత‌నిస్తుంద‌న్న‌ద‌ని గానీ, అస‌లు సాలిడ్ స్టేట్ బ్యాట‌రీలు ఎప్ప‌టిక‌ల్లా వినియ‌గ‌దారుల‌కు అందుబాటులోకి వ‌స్తాయ‌న్న‌ది అస‌లు స‌మ‌స్య‌లు.

ఇప్పటి వ‌ర‌కు ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్స్‌లో వినియోగిస్తున్న లిథియం అయాన్‌ బ్యాటరీల్లో ద్రవరూప ఎలక్ట్రోలైట్‌ను వాడుతున్నాయి ఆటోమొబైల్ సంస్థ‌లు. వాటి స్థానంలో ఘనరూపంలో అయాన్‌-కండక్టింగ్‌ మెటీరియల్‌ను వాడి తయారుచేసేవే సాలిడ్‌ స్టేట్‌ బ్యాటరీలు.

సాలిడ్ స్టేట్ బ్యాటరీ.. ఎలక్ట్రిక్ వాహనాల్లో గేమ్ చేంజర్?!

ద్రవ రూప ఎల‌క్ట్రోలైట్ బ్యాటరీలతో పోలిస్తే వీటిలో ఎక్కువ విద్యుత్‌ను నిల్వ ఉంచవచ్చు. అపుడు బ్యాటరీ పరిమాణం కూడా త‌గ్గించొచ్చు. త‌త్ఫ‌లితంగా కారు బరువు తగ్గి మైలేజీ ఎక్కువ ఇస్తుంది. కారులో స్థలం కూడా పెరుగుతుంది.

లేదంటే అదే పరిమాణంతో ఎక్కువ దూరం వెళ్లే మోడల్ కార్ల‌ను కూడా సిద్ధం చేసుకోవచ్చు. అన్నింటికీ మించి కిలోవాట్‌ అవర్‌కు అయ్యే ఖర్చు తగ్గుతుంది. అందుకే సాలిడ్ స్టేట్ బ్యాట‌రీల కోసం ఫోర్డ్, బీఎండబ్ల్యూ వంటి కంపెనీలు ‘సాలిడ్‌ పవర్‌’ కంపెనీలో పెట్టుబడులు పెట్టాయి.

సాలిడ్ స్టేట్ బ్యాటరీ.. ఎలక్ట్రిక్ వాహనాల్లో గేమ్ చేంజర్?!

మల్టీ లేయర్‌ సెల్‌ వరకు తమ సామర్థ్యం పెంపుద‌ల‌కు పెంచుకోవడానికి సాలిడ్‌ పవర్‌ సిద్ధంగా ఉంది. వాహనాల్లో వాడ‌కానికి ఇది ఉపయోగపడుతుంది. వచ్చే ఏడాది ప్రారంభం నుంచి ఫోర్డ్‌తో పాటు బీఎండబ్ల్యూ కంపెనీల‌కు సైతం 100 యాంప్‌-అవర్‌ బ్యాటరీలను ఇవ్వడానికి సాలిడ్ ప‌వ‌ర్ ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ది.

వ‌చ్చే ఏడాది క‌ల్లా సాలిడ్ ప‌వ‌ర్‌.. సాలిడ్ స్టేట్ బ్యాట‌రీల‌ను అందుబాటులోకి తెచ్చినా.. వాటిని ప్ర‌యోగాత్మ‌కంగా ప‌రిశీలించిన త‌ర్వాత వినియోగంలోకి తేవ‌డానికి మ‌రో ద‌శాబ్ద కాలం ప‌డుతుంద‌ని అంచ‌నా. ఫోర్డ్ యాజ‌మాన్యం ప్ర‌ణాళిక ప్ర‌కారం ఈ ద‌శాబ్ది చివ‌రి నాటికి సాలిడ్ స్టేట్ బ్యాట‌రీలో విద్యుత్ వాహ‌నాలు సిద్ధం కావ‌చ్చున‌ని నిపుణులు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

ప్రధాని మోదీపై పోస్టర్లు.. 17 మంది అరెస్టు

అనిల్‌కి షాక్‌ భారత్‌కు స్విస్‌ వివరాలు

28న జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం

కెయిర్న్‌ చేతికి ఎయిర్ ఇండియా విదేశీ ఆస్తులు?

ఎయిర్‌టెల్‌ థాంక్స్‌ యాప్‌లో వ్యాక్సిన్‌ స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చు!

Amazon miniTV: అమెజాన్‌ మినీ టీవీ లాంచ్‌.. పూర్తిగా ఉచితం

మౌత్‌వాష్‌ ఆర్డర్‌ చేస్తే.. స్మార్ట్‌ఫోన్‌ వచ్చింది!

ఎల్లుండి నుంచి హీరో బైకుల ఉత్ప‌త్తి ప్రారంభం

గుంటూర్‌ జిల్లాలో దారుణం.. భార్య గొంతుకోసిన భర్త

లాక్‌డౌన్ ఉల్లంఘ‌నుల నుంచి రూ 28 ల‌క్ష‌ల జ‌రిమానా వ‌సూలు!

హెచ్‌-4 వీసాదారులకు గూగుల్‌ మద్దతు

క‌రోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్న బిగ్ బీ

13 రోజులు ప్రధానిగా వాజ్‌పేయి.. చ‌రిత్ర‌లో ఈరోజు

ఒడిశాలో షూటింగ్‌ల‌పై నిషేధం..!

బ్రిట‌న్ వైపు ఇండియ‌న్ సంప‌న్నుల చూపు.. నిపుణులు కూడా..!

రేపు తెరుచుకోనున్న కేదార్‌నాథ్ ఆల‌య ద్వారాలు

యూపీలో దారుణం: కొవిడ్‌-19 రోగి కుటుంబంపై కాల్పులు?!

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సాలిడ్ స్టేట్ బ్యాటరీ.. ఎలక్ట్రిక్ వాహనాల్లో గేమ్ చేంజర్?!

ట్రెండింగ్‌

Advertisement