సెగలు కక్కుతున్న అగ్గిరాజు

రాష్ట్రంలో 42 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు
మండుతున్న ఎండలతో ప్రజలు బెంబేలు
మధ్యాహ్నంవేళ రోడ్లపై పలుచగా జనసంచారం
జాగ్రత్తలు పాటించాలని నిపుణుల సూచన
వాతావరణ వివరాలకు టీఎస్-వెదర్ యాప్
హైదరాబాద్/సిటీబ్యూరో, మార్చి 28 (నమస్తే తెలంగాణ): భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. తెలతెలవారుతూనే అరికాలు మంటెక్కిస్తున్నాడు. రాష్ట్రంలో అనేకచోట్ల పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీ సెంటీగ్రేడ్ దాటుతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ఎండలకు ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఎండకుతోడు ఉక్కపోతతో సతమతమవుతున్నారు. మధ్యాహ్నంవేళ బయటకు రావాలంటేనే జంకుతున్నారు. దాంతో హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో రోడ్లపై జనం పలుచగా కనిపిస్తున్నారు. ఏప్రిల్, మే నెలల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీ సెంటిగ్రేడ్ దాడే అవకాశముందని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సొసైటీ (టీఎస్‌డీపీఎస్) అంచనా వేసింది. ఆదివారం రాష్ట్రంలో 42 డిగ్రీల గరిష్ఠ పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరికొద్దిరోజులు ఎండలు ఇలాగే కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం రాష్ట్రంలో అత్యధికంగా మంచిర్యాల జిల్లా నస్పూర్‌లో 42.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లోని నారాయణగూడలో 39.4 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయ్యింది. 14 జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
టీఎస్-వెదర్ మొబైల్ యాప్..
ఉష్ణోగ్రతల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు టీఎస్‌డీపీఎస్ ఆధ్వర్యంలో 589 మండలాల్లో 1,044 ఆటోమేటెడ్ వెదర్ స్టేషన్లు ఏర్పాటుచేశారు. ఈ స్టేషన్లు గంటకోసారి ఉష్ణోగ్రతల వివరాలను తెలియజేస్తున్నాయి. టీఎస్‌డీపీఎస్ ద్వారా గ్రామస్థాయి వరకు వాతావరణ వివరాలను తెలిపేందుకు ప్రభుత్వం (ts- weather) మొబైల్ యాప్‌ను రూపొందించింది. ఈ యాప్‌ను ఫోన్లో ఇన్స్టాల్ చేసుకొంటే ఎప్పటికప్పుడు వాతావరణ వివరాలు తెలుసుకోవచ్చు. జిల్లా కలెక్టర్ కార్యాలయాలు, హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రాంతాల్లో వాతావరణ వివరాలు తెలిపేందుకు ఎల్ఈడీ తెరలను కూడా ప్రభుత్వం ఏర్పాటుచేసింది. విపత్తుల నిర్వహణశాఖ ‘హీట్‌వేవ్ యాక్షన్ ప్లాన్-2021’ను ఇప్పటికే విడుదల చేసింది. రాష్ట్రస్థాయి మానిటరింగ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటుచేసింది. పగటిపూట తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తే వడదెబ్బ తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు ప్రభుత్వం సూచించింది.
వడదెబ్బ లక్షణాలు
తలనొప్పి, తల తిరగడం, తీవ్రమైన జ్వరం, చర్మం పొడిబారటం, వాంతులు, కలవరింతలు, ఫిట్స్, పాక్షిక లేదా పూర్తి అపస్మాకర స్థితి.
ఈ జాగ్రత్తలు తీసుకోండి..
- ఆరుబయిట పనిచేసేవారు ఎండనుంచి కాపాడుకొనేలా జాగ్రత్తలు తీసుకోవాలి. తరచూ నీళ్లు తాగాలి. బయటకు వెళ్లేటప్పుడు వెంట మంచినీళ్లు తీసుకువెళ్లాలి. నిమ్మరసం, కొబ్బరినీళ్లు తాగుతూ ఉండాలి.
- తెలుపు రంగు, లేత వర్ణం కాటన్ వస్ర్తాలు ధరించాలి. తలకు వేడి తగలకుండా టోపీ పెట్టుకోవాలి. పలుచని మజ్జిగ, గూక్లోజ్ నీరు, ఉప్పు- పంచదారతో ఇంటిలోనే తయారుచేసుకున్న ఓఆర్ఎస్ ద్రావణం తాగాలి. వడదెబ్బ తగిలినవారిని నీడలో, చల్లని ప్రదేశంలో ఉంచాలి. చల్లని నీటితో తడిపిన గుడ్డతో తుడుస్తూ ఉండాలి. వెంటనే దగ్గరలోని ఆరోగ్య కేంద్రానికి తరలించాలి.
- కాఫీ, టీ, అధిక వేడిమి సమయంలో సేవించరాదు. జాగ్రత్తలు లేని, నిల్వ చేసిన అహారపదార్ధాలను తినకూడదు.
- ఎండలో పార్క్చేసిన కారులో చిన్న పిల్లలను, వృద్ధులను, ఆరోగ్యం బాగాలేని వారిని ఎక్కువ సేపు ఉంచకూడదు.
ఇవి కూడా చదవండి..
ఓపెన్ స్కూళ్లకూ పాఠ్యపుస్తకాలు
స్వరాష్ట్రంలోనే బీడు భూములకు సాగునీరు
తీరొక్క ఆప్షన్లతో ధరణి పోర్టల్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- heat
- sun
- temperature
RELATED ARTICLES
తాజా వార్తలు
Bloody Romeo | ఇంకా రచ్చ రచ్చే.. ‘బ్లడీ రోమియో’ కోసం నాని స్టైలిష్ మేకోవర్ చూశారా..?
Muscle Growth | 30 ఏళ్లు దాటిన తరువాత కండరాల నిర్మాణం సాధ్యం కాదా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
Election Commission | ఎన్నికల సంఘానికి మాజీ ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల మద్దతు.. 124 మంది బహిరంగ లేఖ
Priyanka Gandhi | ‘దేశంలో ప్రజాస్వామ్యం లేదా..?’ కేంద్ర ప్రభుత్వంపై ప్రియాంకాగాంధీ ఫైర్
నాలుగోసారి ‘మిస్టర్ సింగరేణి’గా రామకృష్ణ
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

