e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home తెలంగాణ జనగర్జన కాదు.. జానా భజన

జనగర్జన కాదు.. జానా భజన

జనగర్జన కాదు.. జానా భజన

17 ఏండ్లు రాష్ట్ర మంత్రిగా ఉండి నల్లగొండ జిల్లాను ఎడారి చేసిండు
నాగార్జునసాగర్‌లో కాంగ్రెస్‌ ఓటమి తథ్యం
హాలియాలో ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్

హాలియా, మార్చి 28 : ‘తాను గెలిస్తే ఏంచేస్తారో ఎన్నికల సభల్లో ప్రజలకు ఎవరైనా చెప్తుంటారు. కానీ, ఈ నెల 27న హాలియాలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో జరిగిన సభ పూర్తిగా జానారెడ్డిని పొగిడించుకోవడానికే పెట్టినట్లు ఉంది. అది జనగర్జన సభ కాదు.. జానారెడ్డి భజన సభ’ అని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ ఎద్దేవా చేశారు. నల్లగొండ జిల్లా హాలియాలో ఆదివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఎవరైనా తాము చేసిన అభివృద్ధిని వివరించి ప్రజలను ఓట్లు అడుగుతారు. కానీ, జానారెడ్డి నామినేషన్‌ వేసి గాంధీభవన్‌లో కూర్చొని.. సీఎం కేసీఆర్‌ను ప్రగతిభవన్‌లో కూర్చోండి, ప్రజలే ఓట్లేస్తారు అనడం అప్రజాస్వామికం అన్నారు. తా ము సాగర్‌లో ప్రచారం చేస్తే జానారెడ్డి బండారం బయటపడుతుందని భయపడుతున్నారని విమర్శించారు. గతం లో మండలానికో సామంతరాజును పెట్టుకొని జానారెడ్డి పరిపాలించాడని, నాటి రాచరికపు విధానాలకు ప్రజలు చరమగీతంపాడి 2018లో టీఆర్‌ఎస్‌ను గెలిపించారని చెప్పారు. సర్పంచులు కాలేని వాళ్లు కూడా ఎమ్మెల్యేలు అయి మాట్లాడుతున్నారనడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. తనది ఆయన స్థాయి కాదని.. 30 ఏండ్లకే ఎంపీ కావడమే తనస్థాయి అని బాల్క సుమన్‌ చురకలు అంటించారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా, 17 ఏండ్లు మంత్రిగా జానారెడ్డి నల్లగొండ జిల్లాకు, నాగార్జునసాగర్‌ నియోజకవర్గానికి చేసింది శూన్యమని చెప్పారు. కాంగ్రెస్‌ ఖేల్‌ ఖతమని, జానారెడ్డి గతమని.. టీఆర్‌ఎస్సే భవిష్యత్‌ అని అన్నారు. ఆ పార్టీ ఇప్పుడు ఢిల్లీలో లేదు.. గల్లీలో కూడా లేదన్నారు. ఉప ఎన్నికల్లో బీజేపీకి ఓటేస్తే నాగార్జున సాగర్‌ నీళ్లను సీసాల్లో పోసి అమ్ముతారని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్‌, కోనేరు కోనప్ప, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, ఆప్కాబ్‌ మాజీ చైర్మన్‌ యడవల్లి విజయేందర్‌రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

జానారెడ్డికి బాల్క సుమన్‌ సంధించిన ప్రశ్నలు

  • సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేసిన మీరు నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్‌ సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోయారు?.
  • పచ్చగా ఉండాల్సిన నల్లగొండ జిల్లా కాంగ్రెస్‌ పాలనలో ఎడారిగా మారింది నిజం కాదా?.
  • ఎస్‌ఎల్‌బీసీ, ఉదయసముద్రం, బ్రాహ్మణవెల్లెంల, ఎస్‌ఆర్‌ఎస్‌పీ -2 ఎందుకు పూర్తి చేయించలేకపోయారు?.
  • గిరిజన తండాలను ఎందుకు గ్రామ పంచాయతీలు చేయలేదు?.
  • జానారెడ్డిని కాదు.. జానానాయక్‌ అని ప్రకటించుకున్న నీవు ఏనాడైనా హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని నీ బంగ్లాలో డైనింగ్‌ టేబుల్‌పై ఏ గిరిజన బిడ్డతోనైనా అన్నం తిన్నావా, చాయ్‌ తాగినవా?
  • దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మీరు, మీ వాళ్లు ప్రచారం చేయవచ్చు. కానీ.. మేము ఇక్కడికి రాకూడదా?
  • మేము చేసిన అభివృద్ధిని చెప్పేందుకు వస్తే.. మీకెందుకు వణుకుడు. మీరెందుకు భయపడుతున్నారు?

ఇవి కూడా చ‌ద‌వండి..

నారీ.. సమరభేరి!

ఓపెన్‌ స్కూళ్లకూ పాఠ్యపుస్తకాలు

స్వరాష్ట్రంలోనే బీడు భూములకు సాగునీరు

ఆత్మీయ వీడ్కోలు

పసిడి పామాయిల్‌

తీరొక్క ఆప్షన్లతో ధరణి పోర్టల్‌

నిర్లక్ష్యంతోనే కార్చిచ్చు

సెగలు కక్కుతున్న అగ్గిరాజు

ఎకరాకు 35-38 వేలు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
జనగర్జన కాదు.. జానా భజన

ట్రెండింగ్‌

Advertisement