హైదరాబాద్ : ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్‌రోడ్డుపై( Outer ring road) మారుతి వ్యాన్(Maruthi van) దగ్ధమైంది. స్థానికుల కథనం మేరకు.. బొంగులూరు(Bonguluru) ఔటర్‌పైకి రాగానే ఓమ్మీ మారుతి వ్యాన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన ఇద్దరు యువకులు వెంటనే కారు దిగి ప్రాణాలు కాపాడుకున్నారు. షార్ట్ సర్క్యూట్‌తోనే వ్యాన్ దగ్ధమైనట్లు తెలిసింది. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.