Ram Charan | కొణిదెల ఇంట్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు.. పిల్లలతో కలిసి రామ్చరణ్, ఉపాసన ప్రత్యేక పూజలు!
RamCharan | మెగా పవర్ స్టార్ రామ్చరణ్, ఉపాసన దంపతుల నివాసంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అత్యంత ఘనంగా, భక్తిశ్రద్ధలతో జరిగాయి.
Upasana | మెగా పవర్ స్టార్ రామ్చరణ్, ఉపాసన దంపతుల నివాసంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అత్యంత ఘనంగా, భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఈ పవిత్ర పర్వదినాన్ని పురస్కరించుకుని రామ్చరణ్, ఉపాసన దంపతులు తమ పిల్లలు క్లిన్ కారా, శివ్ రామ్, అన్వీరలతో కలిసి శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇంటిని అందంగా అలంకరించి, చిన్నారులను శ్రీకృష్ణుడు మరియు రాధారాణి రూపాల్లో ముస్తాబు చేసి భక్తిభావంతో పూజా కార్యక్రమాలను జరిపించారు.
ఈ పూజా వేడుకల్లో కుటుంబ సభ్యులందరూ ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. బుజ్జి కృష్ణులుగా, రాధలుగా ముస్తాబైన చిన్నారుల మధ్య పూజలు నిర్వహించడం కొణిదెల ఇంట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దైవిక వాతావరణం ఉట్టిపడేలా జరిగిన ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలు, విశేషాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో మెగా అభిమానులు ఎంతగానో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అల్లరి కృష్ణుడి రాకతో కొణిదెల ఇంట వెల్లివిరిసిన ఈ ఆనందం, దైవిక దీవెనలు అందరి జీవితాల్లోనూ సంతోషాన్ని నింపాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

