Secretariat | హైదరాబాద్ : తెలంగాణ సచివాలయం ఎదుట సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను విద్యార్థి సంఘాల నాయకులు, పలు రాజకీయ పార్టీల నాయకులు కలిసి దహనం చేశారు. చాలా మంది డీఎస్సీ అభ్యర్థులను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచి, వారిని డీఎస్సీ పరీక్షలకు హాజరు కాకుండా ఆటంకం కలిగించారని విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి డీఎస్సీని వాయిదా వేయాలని వారు డిమాండ్ చేశారు. ఇక సచివాలయం ఎదుట ఆందోళనకు దిగిన ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు.
డీఎస్సీని వాయిదా వేయాలంటూ గత నెల రోజుల నుంచి డీఎస్సీ అభ్యర్థులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్న సంగతి తెలిసిందే. నిరుద్యోగుల బాధలు పట్టించుకోని రేవంత్ సర్కార్ మొండిగా ఇవాళ్టి నుంచి డీఎస్సీ పరీక్షలు ప్రారంభించింది. ఈ పరీక్షలకు వెళ్లే చాలా మందిని పోలీసులు హౌస్ అరెస్టు చేసినట్లు సమాచారం. డీఎస్సీ కంటే ముందు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, డీఏవో ఉద్యోగాలకు ప్రిపేరయ్యామని, జూన్ నెలలో మళ్లీ టెట్ నిర్వహించారని, దీంతో డీఎస్సీకి ప్రిపేరయ్యే సమయం లేకుండా పోయిందని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ వ్యాప్తంగా డీఎస్సీ రాతపరీక్షలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు కొనసాగనున్నాయి. అయితే తొలిసారిగా ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రతి రోజు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక డీఎస్సీ పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇవి కూడా చదవండి..
Telangana | విద్యుత్ కోతలు భరించలేక.. సబ్ స్టేషన్ ముట్టడించిన ఊర్కొండపేట రైతులు
Red Alert | తెలంగాణ అత్యంత భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ
Telangana Assembly | ఈ నెల 23 నుంచి శాసనసభ సమావేశాలు.. 25 లేదా 26న బడ్జెట్..!
Traffic SI | జీడిమెట్ల ట్రాఫిక్ ఎస్ఐ యాదగిరిపై బదిలీ వేటు..
Telangana | చిన్నారులపై వీధి కుక్కల దాడిపై హైకోర్టు మరోసారి ఆగ్రహం
Santosh Kumar | పెబ్బేరు గ్రామస్తులకు హ్యాట్సాఫ్ : మాజీ ఎంపీ సంతోష్ కుమార్