Santosh Kumar | హైదరాబాద్ : గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ సంతోష్ కుమార్ పెబ్బేరు గ్రామస్తులపై ప్రశంసల వర్షం కురిపించారు. 50 ఏండ్ల నాటి జమ్మిచెట్టుకు ప్రాణం పోయడంపై పెబ్బేరు గ్రామస్తులకు సంతోష్ హ్యాట్సాఫ్ చెప్పారు.
వనపర్తి జిల్లా పెబ్బేరులో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా తొలగించిన 50 ఏండ్ల నాటి జమ్మిచెట్టును స్థానికంగా ఉన్న వేణుగోపాల స్వామి ఆలయ ఆవరణలో తిరిగి నాటారు. ఈ సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పర్యావరణాన్ని రక్షించడంలో పెబ్బేరు గ్రామస్తుల అంకితభావం కనబడుతుందని సంతోష్ తెలిపారు. ఆ గ్రామ ప్రజలను మనం కూడా అనుసరించి, హరిత వారసత్వాన్ని కాపాడుకుందామని మాజీ ఎంపీ సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు.
Hats off to the villagers of Pebberu, Vanaparthi Mandal for their outstanding act of sustainability! Relocating the 50-year-old precious #JammiTree to temple grounds exemplifies their dedication to preserving our environment. Let’s follow their lead and cherish our green… pic.twitter.com/7OfFezFluS
— Santosh Kumar J (@SantoshKumarBRS) July 18, 2024
ఇవి కూడా చదవండి..
KTR | డీజీపీగారు.. ఈ భాష మీకు అంగీకారయోగ్యమేనా: కేటీఆర్
Niranjan Reddy | అసలు రూ.లక్ష వరకు రుణం తీసుకున్న రైతులు ఎంత మంది: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
KTR | రుణమాఫీ పేరుతో మరోసారి తెలంగాణ రైతులను మోసం చేస్తున్న రేవంత్ సర్కార్: కేటీఆర్
Job Aspirants | జన్మలో కాంగ్రెస్కు ఓటెయ్యం.. స్థానిక ఎన్నికల్లో అడుగడుగునా అడ్డుపడతం: నిరుద్యోగులు