Telangana Assembly | హైదరాబాద్ : శాసనసభ, మండలి సమావేశాలకు నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నెల 23 నుంచి శాసనసభ, 24 నుంచి శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 23న ఉదయం 11 గంటలకు శాసనసభ ప్రారంభం కానుంది. శాసనసభ సమావేశాల నేపథ్యంలో జులై 25 లేదా 26వ తేదీల్లో బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది కాంగ్రెస్ ప్రభుత్వం.
పది రోజుల పాటు అసెంబ్లీ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ పది రోజుల్లో రైతు భరోసా, కొత్త ఆర్ఓఆర్ చట్టం, తెలంగాణ లోగో మార్పు, తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుతో పాటు పలు బిల్లులపై అసెంబ్లీలో చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో గత కొద్ది రోజుల నుంచి డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఆయా శాఖల అధికారులతో వరుసగా చర్చలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఏయే శాఖలకు కేటాయింపులు ఎలా జరపాలనే అంశంపై సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు అధికారులు.

ఇవి కూడా చదవండి..
Traffic SI | జీడిమెట్ల ట్రాఫిక్ ఎస్ఐ యాదగిరిపై బదిలీ వేటు..
Telangana | చిన్నారులపై వీధి కుక్కల దాడిపై హైకోర్టు మరోసారి ఆగ్రహం
Santosh Kumar | పెబ్బేరు గ్రామస్తులకు హ్యాట్సాఫ్ : మాజీ ఎంపీ సంతోష్ కుమార్
KTR | డీజీపీగారు.. ఈ భాష మీకు అంగీకారయోగ్యమేనా: కేటీఆర్
Niranjan Reddy | అసలు రూ.లక్ష వరకు రుణం తీసుకున్న రైతులు ఎంత మంది: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
KTR | రుణమాఫీ పేరుతో మరోసారి తెలంగాణ రైతులను మోసం చేస్తున్న రేవంత్ సర్కార్: కేటీఆర్
Job Aspirants | జన్మలో కాంగ్రెస్కు ఓటెయ్యం.. స్థానిక ఎన్నికల్లో అడుగడుగునా అడ్డుపడతం: నిరుద్యోగులు