Traffic SI | హైదరాబాద్ : లారీ డ్రైవర్‌ను దుర్భాషలాడిన జీడిమెట్ల ట్రాఫిక్ ఎస్ఐ యాదగిరిపై బదిలీ వేటు పడింది. ఎస్ఐ యాదగిరిపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎస్ఐ యాదగిరిని జీడిమెట్ల నుంచి బదిలీ చేసినట్లు తెలిపారు. ప్రజలకు నిరంతరం సేవ చేయడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో పోలీసుల వ్యవహారశైలిపై డీజీపీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఎక్స్ వేదికగా ప్రశ్నించిన విషయం తెలిసిందే. వినరాని భాషలో సాధారణ పౌరుడిని పోలీస్ సిబ్బంది దుర్భాషలాడటంపై కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు గండి మైసమ్మ ఆలయం సమీపంలో ట్రాఫిక్ పోలీసులు ఓ వాహనదారుడిపై చేయిచేసుకుని, దుర్భాషలాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ నేపథ్యంలో కేటీఆర్ స్పందింస్తూ.. ఇది పోలీస్ శాఖకు, డీజీపీకి అంగీకారయోగ్యమైన భాషనా అని ప్రశ్నించారు. పోలీసులు, ప్రభుత్వ అధికారులకు ప్రజలే జీతాలు చెల్లిస్తున్నారని గుర్తుంచుకోవాలని సూచించారు.
ఈమధ్యకాలంలో ప్రజలతో పోలీసులు ప్రవర్తిస్తున్న తీరు అనేకసార్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. పదుల సంఖ్యలో సోషల్ మీడియాలో వీడియోలు వస్తున్నా పోలీసులు స్పందించడం లేదని చెప్పారు. ప్రజలతో వ్యవహరించే విషయంలో పోలీస్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇక కేటీఆర్ ట్వీట్‌పై తెలంగాణ పోలీసులు స్పందించారు. ఎస్ఐ యాదగిరిపై బదిలీ వేటు వేసినట్లు, ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
The incident occurred within the jurisdiction of the Cyberabad Jeedimetla Traffic Limits. Disciplinary action has been taken against the responsible officer, who has since been transferred from that station. We remain committed to serving the public 24/7.@TelanganaDGP @KTRBRS https://t.co/tJrJgn1NoP
— Telangana Police (@TelanganaCOPs) July 18, 2024
ఇవి కూడా చదవండి..
Telangana | చిన్నారులపై వీధి కుక్కల దాడిపై హైకోర్టు మరోసారి ఆగ్రహం
Santosh Kumar | పెబ్బేరు గ్రామస్తులకు హ్యాట్సాఫ్ : మాజీ ఎంపీ సంతోష్ కుమార్
KTR | డీజీపీగారు.. ఈ భాష మీకు అంగీకారయోగ్యమేనా: కేటీఆర్
Niranjan Reddy | అసలు రూ.లక్ష వరకు రుణం తీసుకున్న రైతులు ఎంత మంది: మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి
KTR | రుణమాఫీ పేరుతో మరోసారి తెలంగాణ రైతులను మోసం చేస్తున్న రేవంత్ సర్కార్: కేటీఆర్
Job Aspirants | జన్మలో కాంగ్రెస్‌కు ఓటెయ్యం.. స్థానిక ఎన్నికల్లో అడుగడుగునా అడ్డుపడతం: నిరుద్యోగులు