కోదాడ, జనవరి 05 : రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలని సీనియర్ సివిల్ జడ్జి కె.సురేశ్ అన్నారు. సోమవారం రోడ్డు భద్రతా దినోత్సవ సందర్భంగా కోదాడ పట్టణంలో ప్రధాన రహదారిపై మండల లీగల్ సెల్ ఆధ్వర్యంలో న్యాయవాదులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జీ మాట్లాడుతూ.. ర్రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ పిలుపు మేరకు రోడ్డు సురక్షా అభియాన్లో భాగంగా రోడ్డు భద్రత, చట్టపరమైన అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. రోడ్డు సేఫ్టీ పద్ధతులు పాటించాలన్నారు. రహదారికి ఎడమ వైపున డ్రైవ్ చేయాలని, మద్యం సేవించి గాని, ట్రిపుల్ రైడ్ గాని చేయరాదన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా నిబంధనలు పాటించాలని ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కె.భవ్య, 1వ, 2వ అదనపు జూనియర్ సివిల్ జడ్జీలు ఎండీ.ఉమర్, ఎస్డీ జాకీయా సుల్తానా, సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ సీహెచ్ సత్యనారాయణ, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఉయ్యాల నర్సయ్య, యడ్లపల్లి వెంకటేశ్వరరావు, కోడూరు వెంకటేశ్వరరావు, చలం,గట్ల నర్సింహారావు, ఎస్కే.రహీం, పాషా, బండి వీరభద్రరావు, ట్రాఫిక్ ఎస్ఐ అంజిరెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంట సత్యనారాయణ, కోర్టు, పోలీసు సిబ్బంది, మండల లీగల్ సర్వీస్ కమిటీ సిబ్బంది మౌనిక, ఫర్వీన్, శైలజ, వాలంటీర్లు మజార్, సైదమ్మ, విజయరావు, కోటయ్య పాల్గొన్నారు.