WhatsApp Plus : వరల్డ్స్ టాప్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త్వరలో సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకురానుంది. ఇది ఆప్షనల్ ప్లాన్ మాత్రమే. దీని పేరు ‘వాట్సాప్ ప్లస్’. ఇకపై వాట్సాప్‌లో కొన్ని లేటెస్ట్, ఇంట్రస్టింగ్ ఫీచర్స్ వాడాలనుకుంటే మాత్రం ఈ సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోవాల్సిందే. అయితే, ఇప్పటివరకు వాట్సాప్‌లో ఉన్న కాల్స్, మెసేజెస్, వీడియో కాలింగ్ వంటి ఫీచర్లను ఉచితంగానే వాడుకోవచ్చు.
ప్రస్తుతం ‘వాట్సాప్ ప్లస్’ ఫీచర్లను మాతృ సంస్థ మెటా అభివృద్ధి చేస్తోంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్ల కోసం ప్రస్తుతం డెవలపింగ్ స్టేజ్‌లోనే ఉంది. ఇక, కొత్తగా రానున్న ‘వాట్సాప్ ప్లస్’లో చాలా కస్టమైజ్డ్, ఇంప్రూవ్డ్ ఫీచర్లుంటాయని కంపెనీ వర్గాలు అంటున్నాయి. ఈజీ చాట్ మేనేజ్మెంట్, మోర్ ఫ్లెక్సిబిలిటీ, పర్సనలైజేషన్, యాప్ లుక్స్ అండ్ ఫంక్షన్స్‌లో మరింత కొత్తదనం ఉంటుంది. టెక్ నిపుణుల ప్రకారం విజువల్ కస్టమైజేషన్, ఇంటర్ఫేస్ కంట్రోల్లపై ‘వాట్సాప్ ప్లస్’ దృష్టి సారించనుంది. యాప్ థీమ్‌ను మార్చుకోవచ్చు. డిఫరెంట్ కలర్స్ యాడ్ చేసుకోవచ్చు. బోలెడన్ని కొత్త ఐకాన్స్ రాబోతున్నాయి. దాదాపు 14 ఐకాన్ స్టైల్స్‌ను డెవలప్ చేస్తోంది సంస్థ. చాట్ పిన్నింగ్ లిమిట్ కూడా పెరగనుంది. ప్రస్తుతం మూడు చాట్స్‌ను మాత్రమే పిన్ చేసుకోవచ్చు. కానీ, సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకుంటే 20 చాట్స్ పిన్ చేసుకోవచ్చు.
వాట్సాప్ మెసేజెస్, కాల్స్‌కు ప్రత్యేకమైన రింగ్టోన్స్ సెట్ చేసుకోవచ్చు. సాధారణంగా ఇతర యాప్స్ నోటిఫికేషన్స్, వాట్సాప్ నోటిఫికేషన్స్‌కు ఒకే తరహా రింగ్ టోన్ ఉంటుంది. కానీ, కొత్త ఫీచర్లతో వాట్సాప్‌నకు, అలాగే వివిధ అకౌంట్లకు డిఫరెంట్ రింగ్‌టోన్ సెట్ చేసుకోవచ్చు. ఇలాంటి పలు కొత్త ఫీచర్లు ‘వాట్సాప్ ప్లస్’లో రానున్నాయి. అయినప్పటికీ ప్రస్తుతం ఉన్న మెసేజెస్, వీడియో, వాయిస్ కాల్స్, ఫొటోలు, వీడియోలు పంపడం, సెక్యూరిటీ ఫీచర్లు వంటివి ఉచితంగానే వాడుకోవచ్చు.