Ashes Series : యాషెస్ సిరీస్‌లో చివరిదైన సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ధీటుగా బదులిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో జో రూట్(160) భారీ శతకంతో ఇంగ్లండ్ సవాల్ విసిరినా.. పేసర్ నెసెర్(4-60) విజృంభణతో ప్రత్యర్ధిని నాలుగొందల లోపే కట్టడి చేసింది. అనంతరం ట్రావిస్ హెడ్(91 నాటౌట్) విధ్వంసక అర్ధశతకం బాదేయగా.. మార్నస్ లబూషేన్(48) క్రీజులో నిలబడ్డాడు. వీరిద్దరి జోరుతో పటిష్ట స్థితిలో నిలిచిన స్మిత్ సేన తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 218 పరుగులు వెనకబడి ఉంది
సిడ్నీ టెస్టు రసవత్తరంగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ భారీ స్కోర్ చేయగా.. ఆస్ట్రేలియా కూడా తగ్గేదేలే అన్నట్టుగా ఆడుతోంది. ఓపెనర్ ట్రావిస్ హెడ్(91 నాటౌట్) మెరుపు అర్ధ శతకంతో ఆసీస్ పుంజుకుంది. రెండో రోజు ఆట ముగిసే సరికి 2 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది ఆతిథ్య జట్టు.
A gorgeous shot from Travis Head to bring up his fifty 🤩#AUSvENG #Ashes pic.twitter.com/OkWVfjO7Ek
— ESPNcricinfo (@ESPNcricinfo) January 5, 2026
అంతుకుముందు దాంతో.. ఓవర్‌నైట్ స్కోర్ 211-3తో రెండో రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన పర్యాటక జట్టు 384కే ఆలౌటయ్యింది. మిడిలార్డర్ క్రీజులో పాతుకుపోవడంతో తొలిసారి ఆలౌట్ గండం తప్పించుకున్న ఇంగ్లండ్‌ను నెసెర్(4-60) దెబ్బకొట్టాడు. జో రూట్(160), వికెట్ కీపర్ జేమీ స్మిత్(46)ల మెరుపులతో నాలుగొందల దిశగా వెళ్తున్న పర్యాటక జట్టు తోకను ఈ ఆసీస్ పేసర్ కత్తిరించాడు.
Travis Head ends the day on 91* as Australia fight back strongly after Joe Root’s 160
Scorecard: https://t.co/Cp0TTOQZAA pic.twitter.com/9r5AnLuLeW
— ESPNcricinfo (@ESPNcricinfo) January 5, 2026
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ సిడ్నీ టెస్టులో తొలి రోజు ఆధిపత్యం చెలాయించింది. వెలుతురు లేమి కారణంగా 45 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైనా పర్యాటక జట్టు మిడిలార్డర్ బ్యాటర్లు క్రీజునంటుకుపోయారు. ఓపెనర్లు బెన్ డకెట్(27), జాక్ క్రాలే(16)లు శుభారంభమిచ్చినా స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగారు.
From England to Australia and everywhere in between. 📍🗺️
Joe Root keeps leaving his century stamp across Test cricket nations. 🏴💪🏼#AUSvENG #Tests #Sportskeeda pic.twitter.com/gP2advdZz4
— Sportskeeda (@Sportskeeda) January 5, 2026
కాసేపటికే బొలాండ్ ఓవర్లో జాకబ్ బెథెల్(10) ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన జో రూట్, హ్యారీ బ్రూక్ ఏమాత్రం ఒత్తిడికి లోనవ్వలేదు. 57కే మూడు కీలక వికెట్లు పడిన వేళ వీరిద్దరూ ఏకొంచెం తడబడినా, ఒక చెత్త షాట్ ఆడినా ఇంగ్లండ్ ఆలౌటయ్యేది. కానీ, వీరు ఆస్ట్రేలియా బౌలర్ల వ్యూహాలను చిత్తు చేస్తూ రూట్, బ్రూక్ అర్ధ శతకాలతో స్కోర్ 200 దాటించారు.