Vijay – Trisha | తమిళ స్టార్ హీరో, విజయ్ ఇటీవలి కాలంలో రాజకీయంగానే కాక వ్యక్తిగత జీవితంలో కూడా వార్తల్లో నిలుస్తున్నారు. ఒకవైపు ఆయన రాజకీయ పార్టీ టీవీకే కార్యకలాపాలు కొనసాగుతుండగా, మరోవైపు ఆయన కుటుంబ జీవితానికి సంబంధించిన అంశాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల సంగీత తన భర్త విజయ్‌తో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం సంచలనంగా మారింది. ఈ సందర్భంగా ఆమె కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. విజయ్ ఒక హీరోయిన్‌తో సన్నిహిత సంబంధం పెట్టుకున్నారని ఆరోపించిన ఆమె, తనకు న్యాయం జరగకపోతే ఆ నటి ఎవరో బయటపెడతానని పేర్కొనడం పెద్ద చర్చకు దారి తీసింది. ఆమె చేసిన ఈ ఆరోపణలు అప్పటి నుంచి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
ఈ పరిస్థితుల్లో తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చెన్నైలో జరిగిన ప్రముఖ సినీ నిర్మాత కళాపతి ఎస్ సురేశ్ కుమారుడి వివాహ రిసెప్షన్‌కు విజయ్ హాజరయ్యారు విజయ్ . ఆ వేడుకకు ఆయనతో పాటు ప్రముఖ నటి త్రిష కూడా వెళ్లారు. ముఖ్యంగా విజయ్, త్రిష ఇద్దరూ ఒకే కారులో కార్యక్రమానికి రావడం అక్కడి అతిథుల దృష్టిని ఆకర్షించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వివాహ వేడుకలో విజయ్ సిల్క్ షర్ట్, ధోతీ ధరించి సంప్రదాయ వేషధారణలో కనిపించగా, త్రిష కూడా అదే రంగుకు సరిపోయే చీరలో మెరిసారు. ఇద్దరూ వేడుకలో చాలా ఆనందంగా పాల్గొనడం గమనార్హం. దీంతో సంగీత చేసిన ఆరోపణల్లో పేర్కొన్న నటి త్రిషేనేమో అనే అనుమానాలను తమిళ మీడియా వ్యక్తం చేస్తోంది.
ఇక కోలీవుడ్‌లో త్రిష ప్రముఖ హీరోయిన్గా కొనసాగుతున్నారు. విజయ్–త్రిష జోడీకి కూడా మంచి క్రేజ్ ఉంది. వీరిద్దరూ కలిసి నటించిన గిల్లి, తిరుపాచి, లియో వంటి సినిమాలు భారీ విజయాలు సాధించాయి. అయితే గతంలో కూడా విజయ్, త్రిషకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలపై చర్చలు జరిగాయి. ప్రస్తుతం విజయ్–సంగీత విడాకుల వ్యవహారం నేపథ్యంలో మరోసారి ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఇక తాజా పరిణామాల మధ్య ఈ వ్యవహారం ఎటు దారితీస్తుందో చూడాలి.
Star presence at the reception! ✨#Thalapathy #Vijay and #Trisha attend #KalpathiSSuresh & #MeenakshiSuresh’s son’s wedding reception.@actorvijay @trishtrashers#ThalapathyVijay #Trisha #Kollywood #TamilCinema #TVK pic.twitter.com/VUk1xav3we
— Aristotle (@goLoko77) March 5, 2026