Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Minister Snaps At Daler Mehndi | పంజాబ్ సింగర్ దలేర్ మెహందీపై ఒక మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. నవరాత్రి ఉత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆ సింగర్ మద్యం సేవించి పాటలు పాడుతున్నారని ఆయన ఆరోపించారు. ఇది ఏమాత్రం తగదంటూ ఆ గాయకుడిపై మండిపడ్డారు.
డెహ్రాడూన్: పంజాబ్ సింగర్ దలేర్ మెహందీపై ఒక మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. నవరాత్రి ఉత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆ సింగర్ మద్యం సేవించి పాటలు పాడుతున్నారని ఆయన ఆరోపించారు. ఇది ఏమాత్రం తగదంటూ ఆ గాయకుడిపై మండిపడ్డారు. (Minister Snaps At Daler Mehndi) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. నవరాత్రి వేడుకల్లో భాగంగా కుంజాపురి జాతరలో ఆదివారం సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించారు. పంజాబ్‌కు చెందిన ప్రసిద్ధ గాయకుడు దలేర్ మెహందీ తన బృందంతో కలిసి ప్రదర్శన ఇచ్చారు.
కాగా, ఆ రాష్ట్ర మంత్రి సుబోధ్ ఉనియాల్ ఆ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. వేదికపైకి వచ్చిన ఆయన పాడటం ఆపేయాలని దలేర్ మెహందీని కోరారు. ఆ తర్వాత పంజాబ్ సింగర్‌పై ఆయన మండిపడ్డారు. ‘నవరాత్రి సందర్భంగా దుర్గామాతకు సంబంధించిన కార్యక్రమం ఇది. మీరు మద్యం సేవించి ఇక్కడ పాటలు పాడుతున్నారు, ఇది ఏమాత్రం తగదు’ అని అన్నారు.
మరోవైపు ఈ వేడుకలకు ఉన్న మతపరమైన ప్రాముఖ్యత దృష్ట్యా, ఆ సందర్భానికి తగిన గౌరవాన్ని, మర్యాదను కళాకారులు పాటించాలని మంత్రి సుబోధ్ ఉనియాల్ సూచించారు. ‘ప్రజలకు వినోదాన్ని అందించాలని మిమ్మల్ని పిలిచాం. కానీ మీరు మమ్మల్ని అపహాస్యం చేస్తున్నారు. ఇది తప్పు, చాలా తప్పు. మీకు మంచి పేరుంది. దానిని మేము గౌరవించాలి. అందుకే మిమ్మల్ని ఆహ్వానించాం’ అని ఆయన అన్నారు.
అయితే మద్యం మత్తులో ఉన్నట్లు ఆరోపణలు వచ్చిన సింగర్ దలేర్ మెహందీ, మంత్రి సుబోధ్ ఉనియాల్ వ్యాఖ్యలకు సమాధానం ఇచ్చే పరిస్థితిలో లేనట్లుగా కనిపించారు. ‘సార్, చేతులు జోడించి వేడుకుంటున్నా. దయచేసి వేదిక దిగి వెళ్లండి’ అని మంత్రిని ఆయన కోరారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
“We called you so that our people could be entertained. You are making a fool of us. There is a Durga Mata programme for Navratri, and you are singing at the event after drinking alcohol”
—Cabinet minister Subodh Uniyal snaps at Daler Mehndi on stage during event https://t.co/pC7QC3YlFp
— The Indian Idiot (@theindianidiot) October 19, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Tiger Shroff | అసలు నన్నెందుకు టార్గెట్ చేశారో అర్థం కావట్లేదు : టైగర్ ష్రాఫ్
Mission bhageeratha | పర్యవేక్షణ లోపమా..? ఇష్టారాజ్యమా..? వృథాగా మిషన్ భగీరథ నీరు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెం జడ్పీహెచ్ఎస్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
Medical Services | వైద్య సేవలు, నిర్వహణ మెరుగ్గా ఉండాలి : కలెక్టర్ చాహత్‌బాజ్‌పాయ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

