టాప్ 20 కాలుష్య నగరాల్లో 13 భారత్‌లోనే!
ప్రపంచంలోని అత్యంత కలుషిత నగరాల గ్లోబల్ ర్యాంకింగ్‌లో భారత్ నుంచే అత్యధికంగా ఉన్నాయి. ఈ గ్లోబల్ ర్యాంకింగ్ జాబితాలోని 20 నగరాల్లో 13 నగరాలు భారత్‌కు చెందినవే కావడం దేశంలో కాలుష్య స్థాయిని తెలియచేస్తున్నాయి. సోమవారం విడుదలైన ఈ గ్లోబల్ జాబితాలో వాయు కాలుష్యానికి అత్యధికంగా గురవుతున్న ఢిల్లీ లేకపోవడం గమనార్హం.
- గ్లోబల్ ర్యాంకింగ్లోబులంద్ షహర్‌కు 3వ స్థానం
న్యూఢిల్లీ : ప్రపంచంలోని అత్యంత కలుషిత నగరాల గ్లోబల్ ర్యాంకింగ్‌లో భారత్ నుంచే అత్యధికంగా ఉన్నాయి. ఈ గ్లోబల్ ర్యాంకింగ్ జాబితాలోని 20 నగరాల్లో 13 నగరాలు భారత్‌కు చెందినవే కావడం దేశంలో కాలుష్య స్థాయిని తెలియచేస్తున్నాయి. సోమవారం విడుదలైన ఈ గ్లోబల్ జాబితాలో వాయు కాలుష్యానికి అత్యధికంగా గురవుతున్న ఢిల్లీ లేకపోవడం గమనార్హం. సోమవారం మధ్యాహ్నం సుమారు 3.30 గంటలకు(భారత కాలమానం) గాలి నాణ్యత సూచీ(ఏక్యూఐ) నుంచి సేకరించిన సమాచారం ప్రకారం యూపీలోని బులంద్‌షహర్ ప్రపంచవ్యాప్తంగా 3వ స్థానంలో నిలిచింది. ఇక్కడ నమోదైన యూఎస్ ఏక్యూ విలువ 198గా ఉంది. దీన్ని ‘అనారోగ్యకరమైనది’(అన్‌హెల్తీ)గా వర్గీకరించారు.
త్రిపురలోని అగర్తల 181 ఏక్యూ విలువతో నాలుగవ స్థానంలో ఉంది. టాప్ 20 జాబితాలో ఉన్న ఇతర భారతీయ నగరాల్లో రాజస్థాన్‌లోని పాలి, ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ ఉన్నాయి. ఈ రెండు నగరాల్లోనూ ఏక్యూఐ విలువ 174గా నమోదైంది. మధ్యప్రదేశ్‌లోని బుర్హన్‌పూర్‌లో కూడా 174 ఏక్యూఐ నమోదు కాగా, హర్యానాలోని రోహ్తక్లో 172 ఏక్యూఐ నమోదైంది. రాజస్థాన్‌లోని కోటాలో గాలి నాణ్యత సూచీ 170గా నమోదైంది. ఆ తర్వాతి స్థానాల్లో ముంబై(167), హాపుర్(166), హిస్సార్(165), బికనేర్(165), బరేలీ (164) ఉన్నాయి. ఈ గణాంకాలతో అత్యం త కాలుష్యంతో కూడిన పట్టణ ప్రాంతాల జాబితాలో ఈ నగరాలు చోటు సంపాదించుకున్నాయి.
ప్రపంచ నంబర్ 1
అత్యంత కాలుష్య నగరాల జాబితాలో ఇండోనేషియా నగరాలు అగ్రస్థానంలో నిలిచేందుకు పోటీపడ్డాయి. మధ్య కాలిమంటన్‌లోని పలాంగ్కరాయా తీవ్రమైన క్యాటగిరీలో మొదటి స్థానంలో నిలిచింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

