పాలమూరు- రంగారెడ్డి మోటర్లు బంద్.. పంపులు నడిపే చేతగాక హ్యాండ్సప్
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు లిఫ్ట్-1లోని నీటిని ఎత్తిపోసిన మోటర్లు బంద్ అయ్యాయి. నార్లాపూర్ రిజర్వాయర్ సామర్థ్యానికి చేరకముందే సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు పంపులను ఆఫ్ చేయడంతో నీటి ఎత్తిపోతలు నిలిచిపోయాయి.
- నడిపింది 2 మోటర్లు.. ఎత్తిపోసింది 2 టీఎంసీలు
- నార్లాపూర్ రిజర్వాయర్ సామర్థ్యానికి చేరకముందే ఆఫ్
- శ్రీశైలం నుంచి లిఫ్ట్‌కు అవకాశమున్నా సర్కార్ అలసత్వం
- పంపులను నడుపకుండా సాగు, తాగునీటి కష్టాలు తెచ్చిపెడుతున్నదని ప్రభుత్వంపై వెల్లువెత్తుతున్న విమర్శలు
కొల్లాపూర్, అక్టోబర్ 19 : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు లిఫ్ట్-1లోని నీటిని ఎత్తిపోసిన మోటర్లు బంద్ అయ్యాయి. నార్లాపూర్ రిజర్వాయర్ సామర్థ్యానికి చేరకముందే సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు పంపులను ఆఫ్ చేయడంతో నీటి ఎత్తిపోతలు నిలిచిపోయాయి. నార్లాపూర్‌లో నీటిమట్టం 6.5 టీఎంసీలకు చేరకముందే ప్రభుత్వం బాహుబలి మోటర్లను బంద్ పెట్టింది. బుధవారం మధ్యాహ్నం ప్రారంభమైన మోటర్లు సాయంత్రం ఆఫ్ చేయగా.. అదేరోజు రాత్రి 9:30 గంటల తర్వాత తిరిగి ప్రారంభించారు. సోమవారం మధ్యాహ్నం నాటికి ఆఫ్ అయ్యాయి. శ్రీశైలం డెడ్‌స్టోరేజీలో ఉన్నా పీఆర్ఎల్ఐ పంపులను నడిపించేందుకు అవకాశం ఉన్నది.
కానీ శ్రీశైలం జలాశయం నుంచి పీఆర్ఎల్ఐ అప్రోచ్ కెనాల్‌కు.. అక్కడి నుంచి ఇన్‌టేక్‌వెల్ ద్వారా పంప్‌హౌస్‌లోకి ఫ్లో కొనసాగుతున్నా పంప్‌లను బంద్ పెట్టడంపై పలువురు విమర్శలు చేస్తున్నారు. పంపులను మరికొన్ని రోజులు నడిపితే రిజర్వాయర్ పూర్తి సామర్థ్యంలోకి వచ్చేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మోటర్లను మళ్లీ ఆన్ చేసి ఏదుల రిజర్వాయర్‌కు కృష్ణా జలాలను తరలించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పీఆర్ఎల్ఐ పంపులను ఆన్ చేయాలనే డిమాండ్‌తో బీఆర్ఎస్ నాయకత్వం చేపట్టిన ఉద్యమంతోనే కాంగ్రెస్ సర్కార్ పంపులను ఆన్ చేసింది.. లేదంటే ఆన్ చేయకుండా కృష్ణా జలాలను ఆంధ్రాకు తరలించడమో?

లేదా ఉన్న నీటిని ఎల్ నినోకు ఆవిరి చేసేదని పలువురు చర్చించుకుంటున్నారు. పాలమూరు పంపులను నడిపేందుకు కరెంటే సమస్యగా ఉన్నదా? అనే సందేహం రైతుల నుంచి వ్యక్తమవుతున్నది. పంపులు ఆన్ అయిన రోజే ప్రభుత్వానికి, గ్రిడ్‌కు తలెత్తిన సమన్వయలోపంతో ఫ్రీక్వెన్సీలలో హెచ్చుతగ్గులు వచ్చిన విషయం తెలిసిందే.. కానీ ప్రభుత్వం మాత్రం విద్యుత్తును ఆదా చేసేందుకు పంపులను నడిపించడకుండా సాగు, తాగునీటి కష్టాలను కొనితెచ్చి పెడుతుందని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

