గుజరాత్లో విద్యుత్తు సంక్షోభం.. మోదీ స్వరాష్ట్రంలో చీకట్లు.. కోతలతో జనం అవస్థలు
ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో చీకట్లు కమ్ముకున్నాయి. తీవ్ర విద్యుత్తు సంక్షోభంతో రాష్ట్రం అల్లాడిపోతున్నది. కరెంటు కోతలతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పెరుగుతున్న విద్యుత్తు డిమాండ్, బొగ్గు కొరత, తగ్గిన పవన విద్యుదుత్పత్తి, జలవిద్యుత్తు ఉత్పత్తికి అవసరమైన నీటి నిల్వలు తగ్గిపోవడం వంటి పరిణామాలు రాష్ట్రంలో విద్యుత్తు సరఫరాపై ఒత్తిడిని పెంచుతున్నాయి.
- గ్రామీణ, వ్యవసాయ ప్రాంతాల్లో భారీగా కోతలు
- పరిశ్రమలకు వారంలో ఎనిమిది గంటలు పవర్ కట్
- వేల కోట్ల రూపాయల నష్టం
- లక్షల మంది ఉపాధిపై ప్రభావం
అహ్మదాబాద్ : ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో చీకట్లు కమ్ముకున్నాయి. తీవ్ర విద్యుత్తు సంక్షోభంతో రాష్ట్రం అల్లాడిపోతున్నది. కరెంటు కోతలతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పెరుగుతున్న విద్యుత్తు డిమాండ్, బొగ్గు కొరత, తగ్గిన పవన విద్యుదుత్పత్తి, జలవిద్యుత్తు ఉత్పత్తికి అవసరమైన నీటి నిల్వలు తగ్గిపోవడం వంటి పరిణామాలు రాష్ట్రంలో విద్యుత్తు సరఫరాపై ఒత్తిడిని పెంచుతున్నాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం పారిశ్రామిక ప్రాంతాల్లో వారానికి ఒకరోజు 8 గంటలపాటు విద్యుత్తు కోతలు విధించే చర్యలు చేపట్టింది. దీంతో పరిశ్రమల ఉత్పత్తి, దీపావళి ఆర్డర్ల సరఫరా, కార్మికుల ఉపాధిపై ఆందోళన వ్యక్తమవుతున్నది. రానున్న వేసవిలో నివాస ప్రాంతాలకూ విద్యుత్తు కోతలు తప్పకపోవచ్చన్న హెచ్చరికలు మరింత కలవరపెడుతున్నాయి.
జ్యోతిగ్రామ్ స్కీమ్‌కూ గ్రహణం
గుజరాత్‌లోని గ్రామాలు, వ్యవసాయ ప్రాంతాల్లో ఇప్పటికే విద్యుత్తు కోతలు మొదలయ్యాయి. గ్రామాలకు 24 గంటల విద్యుత్తు సరఫరా అందించే జ్యోతిగ్రామ్ పథకం అమలు ఉన్న ప్రాంతాల్లోనూ కోతలు విధిస్తున్నట్టు కథనాలు వెలువడుతున్నాయి. సాగునీటి కోసం విద్యుత్తుపై ఆధారపడే రైతులకు మోటార్లు పనిచేయక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మూడు ఫేజ్‌ల సరఫరా ఉండే కొన్ని ప్రాంతాల్లో విద్యుత్తు ఆదా కోసం సింగిల్ ఫేజ్ సరఫరాకు మారే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. రానున్న వేసవిలో పరిస్థితులు మరింత దిగజారవచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
25 లక్షల మంది ఉపాధిపై ప్రభావం
విద్యుత్తు కొరత నేపథ్యంలో పారిశ్రామిక ప్రాంతాల్లో వారానికి ఒకరోజు ఎనిమిది గంటలపాటు సరఫరా నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిర్దేశించిన వంతులవారీ సెలవు రోజుల్లో సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి వరకు కోతలు విధించనున్నారు. ఈ నిర్ణయం దక్షిణ గుజరాత్‌లోని పరిశ్రమలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నది. నవ్సారీ జీఐడీసీలోని 250కిపైగా చిన్న, పెద్ద పారిశ్రామిక యూనిట్లు ఈ కోతల ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయి. సూరత్ సహా దక్షిణ గుజరాత్‌లోని వస్త్ర, వజ్రాల, తయారీ రంగ పరిశ్రమలు దీపావళి ఆర్డర్లను గడువులోగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఈ నిర్ణయం వెలువడింది. ఉత్పత్తి నిలిచిపోతే సరుకుల ప్యాకింగ్, లోడింగ్, రవాణా, పంపిణీ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడి వినియోగదారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం కష్టమవుతుంది. సదరన్ గుజరాత్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షుడు అశోక్ జిరావాలా మాట్లాడుతూ.. ఈ కోతల వల్ల పారిశ్రామిక రంగానికి వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు. 25 లక్షల మంది కార్మికుల ఉపాధిపైనా ప్రభావం చూపొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. గత 26 ఏండ్లలో ఇంత విస్తృత స్థాయిలో కోతలు విధించడం ఇదే తొలిసారి అని తెలిపారు.
ఇదేనా గుజరాత్ మాడల్?
రాష్ట్రంలో విద్యుత్తు కోతలపై బీజేపీ సర్కార్ మీద విపక్షాలు మండిపడుతున్నాయి. ఇదేనా గుజరాత్ మాడల్ అంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి. సాయంత్రం నుంచి రాత్రి వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేయడాన్ని నిరసిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన విసావదర్ ఎమ్మెల్యే గోపాల్ ఇటాలియా తన మద్దతుదారులతో కలిసి చిన్న లాంతర్లు పట్టుకొని విద్యుత్తు బోర్డు కార్యాలయానికి చేరుకుని నిరసన తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

